చెర్రీ నంబర్ సెంటిమెంట్

0ram-charan-sentimentమెగా ఫ్యామిలీకి కార్లు, బైకులంటే తగని మక్కువ. పవన్‌కళ్యాణ్‌కు బైక్స్ అన్నా, గన్స్ అన్నా మహా మోజు అన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ కు కూడా వెహికల్స్ సెంటిమెంట్ ఎక్కువేనని ఎవడు సినిమాకు సంబంధించిన ఒక అంశం గమనిస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాలో చెర్రీ యూజ్ చేసే బైక్‌కు తన సొంత కారు నంబర్‌ను వాడారట. చెర్రీ కార్ నంబర్ CB 2727. ఎవడు సినామాలో చెర్రీ వాడే బైక్ నంబర్ AV 2727. ఈ రెండూ యాదృచ్చికంగా కలిసాయా.. కావాలనే చెర్రీ సెంటిమెంట్ ప్రకారం అదే నంబర్ ఉన్న బైక్‌ను ఉపయోగించమని చెప్పాడో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్స్ ఎక్కువే. బ్లాక్ బస్టర్ అయిన సినిమా రిలీజ్ డేట్‌కి మరో సినిమా రిలీజ్ చేసి అంతకు మించిన హిట్ కొట్టాలని చూడటం రీసెంట్ గా అయితే ఎవడు విషయంలో జరుగుతుంది. మగధీర లాంటి ఆల్‌టైమ్‌రికార్డ్ మూవీ 2009 జులై 31 న రిలీజ్ అయ్యింది. ఇప్పుడూ ఎవడు కూడా అదే డేట్‌కు రిలీజ్ చేస్తున్నారు. ఆల్‌రెడీ చిరు ‘ఎవడు ‘.. మగధీరను మించే హిట్ సినిమా అనీ, జూబిలీ ఫంక్షన్ కూడా జరుగుతుందని హైప్ క్రియేట్ చేశాడు.  సెంటిమెంట్ ప్రకారమే చెర్రీ కూడా తన కార్ నంబర్‌ను సినిమాలో బైక్‌కు వాడుంటాడని అనుకుంటున్నారు.