ఆ టైటిల్ వద్దంటున్న చరణ్

0టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ను వాడుకోవడంలో మెగా ఫ్యామిలీ ఈ మధ్య చాలా ఆలోచిస్తోంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బాగానే వాడుతున్నా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోతున్నాడు. గతంలో చరణ్ పాటల రూపంలో ట్రై చేసినా ప్రస్తుతం చేయడం లేదు. అదే తరహాలో టైటిల్స్ విషయంలో కూడా మెగా యువ హీరోలు ఎక్కువగా డేర్ తీసుకోవడం లేదు. రీసెంట్ గా రామ్ చరణ్ ఒక టైటిల్ ప్రస్తావన రాగానే పాడు చేయవద్దులే అని ఎండ్ చెప్పేశాడట.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా టైటిల్ పై ప్రస్తుతం రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా రూమర్స్ గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ లో ఒకటైన జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు ప్రస్తావనకు వచ్చిందని టాక్. దర్శకుడు బోయపాటి జగదేక వీరుడు సెట్ చేద్దామని చెప్పాడట.

కానీ చరణ్ మాత్రం అతని అభిప్రాయాన్ని సున్నితంగా అక్కడే కట్ చేశాడట. ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే.. మెగాస్టార్ తో పాటు శ్రీదేవి కూడా గుర్తుకు వస్తుంది. వారిద్దరు ఉంటేనే అది పుట్టింది. అందుకే అంత పెద్ద హిట్ అయ్యిందని రామ్ చరణ్ చెప్పి.. పేరును విడగొట్టి కేవలం జగదేక వీరుడు అని సెట్ చేయడం చెడగొట్టుకోవడం అని చెప్పారట. దీంతో బోయపాటి కూడా హీరో గారి మాటకు విలువిచ్చి మరో టైటిల్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం.