నాని డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ?

0Ram-Charan-Planning-A-Movieనేను లోకల్ సినిమాతో న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసిన దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో రంగస్థలం 1985 సినిమాతో బిజీగా వున్న చెర్రీ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. కొరటాల శివతో సినిమా పూర్తయ్యాకా నేను లోకల్ సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కినతో సినిమా చేసే అవకాశాలున్నాయి.

త్రినాథ రావు వినిపించిన యాక్షన్ స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌తో రావాల్సిందిగా సూచించారట చరణ్. చరణ్ చెప్పిన సూచనలే మేరకు ఆ స్టోరీని డెవలప్ చేసే పనిలో పడ్డారు త్రినాథ రావు. త్రినాథ రావు డెవలప్ చేసిన స్టోరీ కానీ చరణ్‌ని ఆకట్టుకుంటే, కొరటాల-చరణ్‌ల సినిమా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది వీళ్లిద్దరి సినిమానే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం వుంది. సినీవర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ వున్నట్టు సమాచారం.