ఆర్ సి ఫ్యాన్స్ గెట్ రెడీ!!

0

గత రెండు మూడు నెలలుగా ఎలాంటి అప్ డేట్ లేక తమ హీరో సినిమా ప్రోగ్రెస్ గురించి తెగ ఆందోళన చెందుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పెద్ద ఊరట. బోయపాటి శీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్లు తక్కువ గ్యాప్ లో ఒకదాని వెంట మరొకటి విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ నవంబర్ 6 అంటే రేవు మధ్యాహ్నం 1 గంటకు వదలనుండగా టీజర్ ను మూడు రోజుల గ్యాప్ లో నవంబర్ 9న ఉదయం 10.25 లకు లాంచ్ చేయబోతున్నారు.

అంటే మెగా ఫ్యాన్స్ కు రెండు వరుస పండగలను ప్లాన్ చేశారన్న మాట. షూటింగ్ కాస్త ఆలస్యంగా జరగడం ఇంకో రెండు పాటల చిత్రీకరణ బాలన్స్ ఉండటం లాంటి కారణాల వల్ల ఏదైనా వాయిదా ఉండొచ్చేమో అన్న పుకార్ల నేపథ్యంలో డివివి దానయ్య సంక్రాంతికి రావడం పక్కా అని ఇటీవలే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. పోస్టర్ టీజర్ వచ్చాయి అంటే హంగామా మొదలైనట్టే.

సంక్రాంతి రేస్ లో ఉన్న బాలకృష్ణ ఎన్టీఆర్ ఇప్పటికే పబ్లిసిటీ విషయంలో ముందుండగా మరో మల్టీ స్టారర్ ఎఫ్2 ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేసి బోణీ చేసారు. సో ఫైనల్ గా లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తోంది చరణే. ఇప్పటికే మూడు ఫైనల్ పోస్టర్లు ఎంపిక చేసారని ఈ రాత్రికి అందులో ఒకటి లేదా రెండు ఖరారు చేసి రేపు విడుదల చేసే ఆలోచన ఉందట. టైటిల్ మాత్రం వినయ విధేయ రామ అనే విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బ్యానర్ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది కాబట్టి అనూహ్యమైన మార్పు ఉండకపోవచ్చు. సో చెర్రీ ఫ్యాన్స్ ఎదురుచూపులకు మొదటి బ్రేక్ రేపు మధ్యాన్నం పడనుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఆర్యన్ రాజేష్ వివేక్ ఒబేరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Please Read Disclaimer