స్పీడ్ పెంచారు.. తేడా రాదు కదా?

0మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. రంగస్థలం సినిమాకు ఎక్కువ సమయం తీసుకున్నందుకు కోపం వచ్చింది అనుకుంటా అందుకే బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాకీ ఎండింగ్ కు వచ్చేసింది. ముందుగా సెట్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిత్ర యూనిట్ కొన్నీ ఈజీ పనులను ముందుగా పూర్తి చేస్తోంది.

జులై మొదటి వారంలో జార్జియా – యూరప్ వంటి దేశాల్లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే లొకేషన్స్ కు సంబంధించిన పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. ఆ తరువాత సినిమాలోని కొన్ని ఎమోషన్స్ సీన్స్ ను కూడా పూర్తి చేసి ఇంకా ఏమైనా ప్యాచప్ పనులు మిగిలి ఉంటే వాటిని కూడా ఎండ్ చేయాలని అనుకుంటున్నారు. ఫైనల్ గా సినిమా షూటింగ్ ని అక్టోబర్ కి అయిపోగొట్టాలి. మెయిన్ గా ఇతర సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నా పరవాలేదు గాని రామ్ చరణ్ కు సంబంధించిన పనులు ఒక్కటి కూడా బ్యాలెన్స్ ఉండకూడదు. ఆఖరికి డబ్బింగ్ పనులు కూడా అయిపోవాలని చరణ్ ముందే చెప్పాడట.

ఎందుకంటే చరణ్ ఆ తరువాత రాజమౌళి – తారక్ తో కలవాలి కదా. #RRR షూటింగ్ సెట్స్ పైకి వచ్చేది ఆ సమయంలోనే కాబట్టి బోయపాటి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చరణ్ ఆలోచిస్తున్నాడు. అలాగే బోయపాటి కూడా నెక్స్ట్ బాలయ్యతో సినిమా చెయ్యాలి. దాని కథను కూడా దర్శకుడు ఇప్పుడే రాస్తుండడం స్పెషల్ అని చెప్పాలి. మరి స్పీడ్ గా ఫినిష్ చేస్తున్న ఈ మెటీరియల్ లో తేడా ఏమి రాదు కదా అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.