రేపు బాబాయ్ కి సర్ ప్రైజ్ ఇస్తా: చరణ్

0రేపు సెప్టెంబర్ 2. అందులో స్పెషల్ ఏముంది అని అడిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని ఏ మెగా ఫ్యాన్ ని అడిగినా వెంటనే చెప్తాడు. మరి పవన్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పండగే. అదే సినిమాల్లో ఉంటే.. పవన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్.. కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఏదో ఒకటి వచ్చి ఉండేది. అలా అని అభిమానులు నిరాశపడవలసిన అవసరమే లేదు.

ఎందుకంటే రామ్ చరణ్ బాబాయ్ కోసం ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ మాట్లాడిన వీడియో ను పోస్ట్ చేసింది. అందులో చరణ్ “హాయ్ గయ్స్ మీకందరికీ 24 గంటల్లో ఒక సర్ ప్రైజ్ ఉంది. కళ్యాణ్ బాబాయ్ పుట్టిన రోజు అయన కోసం ఒక వీడియో పోస్ట్ చెస్తున్నాము. వెయిట్ చెయ్యండి.” అంతే కాకుండా “బాబాయ్ నీకో సర్ ప్రైజ్ ఉంది” అంటూ పవన్ ను ఉద్దేశించి చెప్పాడు.

చరణ్ ఈ హింట్ ఇచ్చినప్పటి నుంచి ఆ సర్ ప్రైజ్ ఎంటా అని ఫ్యాన్స్ అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఇక అది ఏదైనా స్పెషల్ వీడియోనా.. లేక చరణ్ తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ – టైటిల్ లాంటివి బాబాయ్ చేత విడుదల చేయిస్తారా అనే విషయం అర్థంకావడం లేదు. ఏంటో ఈ చిట్టిబాబు.. మనం చెప్తే వినబడదు.. అయన చెప్తే మనకు అర్థం కాదు. దీనికంతటికీ కారణం ఆ సుక్కు!