ఫుల్ మాస్ బయటకు తీసిన చెర్రీ!

0

‘రంగస్థలం’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ సినిమా చేసున్నాడగానే ఇక మాస్ రచ్చ స్టార్ట్ అని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ సినిమా మొదలు పెట్టి చాలా నెలలు అవుతున్న ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక వాళ్ళ వెయిటింగ్ పూర్తయింది. ఫైనల్ గా #RC12 ఫస్ట్ లుక్ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేశారు నిర్మాతలు.

ప్రచారంలో ఉన్నట్టే ‘వినయ విధేయ రామ’ టైటిల్ కన్ఫాం అయింది. అంతే కాకుండా టీజర్ ను నవంబర్ 9 వ తారీఖు ఉదయం 10.25 కు విడుదల చేస్తామని మరోసారి పోస్టర్ లో తెలిపారు. టైటిల్ లోగో డిజైన్ మాత్రం కేకపుట్టిస్తోంది. ఆ లోగోను చూస్తుంటేనే పవర్ఫుల్ గా అనిపిస్తోంది. టైటిల్ లోగో పైన చక్రం డిజైన్.. విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి ఉండడం.. బాణం చివరన ఒక మెరుపు.. టైటిల్ అక్షరాల మద్యలో నుండి అటూ ఇటూ వచ్చిన ఒక ఎర్రటి కండువా లాంటి క్లాత్ అన్నీ సూపర్ గా ఉన్నాయి.

ఇక చరణ్ ఫుల్ మాస్ అవతారంలో రగ్డ్ లుక్ తో ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ తెప్పించేలా ఉన్నాడు. బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ షర్ట్.. బ్లాక్ జీన్స్.. పైన తెల్లటి సున్నం లాంటి మరకలతో రఫ్ గా ఉన్నాడు. ఎడమ చేత్తో ఓ కత్తి పట్టుకుని పరిగెత్తుతూ.. కుడి చేత్తో ఒక రైఫిల్ ను పట్టుకునేందుకు రెడీగా ఉన్నాడు. గడ్డం మీసం చూస్తుంటే.. ఇక మెగా పవర్ స్టార్ కాదు .. మెగాస్టార్ అన్నట్టే ఉంది. వినయ విధేయ అని టైటిల్ లో ఉంది కానీ వినయంగా విధేయంగా మాత్రం కనిపించడం లేదు! ఈ లెక్కన సంక్రాంతికి చిన్న బాసు బాక్సులు బద్దలు కొట్టడం ఖాయం.
Please Read Disclaimer