శిష్యుడు చూపించిన దారిలో వెళ్తున్న వర్మ!!

0తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్మ శిష్యులు చాలా మంది ఉంటారు. కెరీర్ ఆరంభం నుండి కూడా వర్మ ఎంతో మంది శిష్యులను దర్శకులుగా తయారు చేశాడు. ఇతర దర్శకుల వద్ద కంటే వర్మ వద్ద శిష్యరికం చేస్తే వెంటనే డైరెక్టర్ అవ్వొచ్చు అనేది అప్పట్లో ఒక టాక్ ఉండేది. ఎంతో మంది దర్శకులను తన కంపెనీ నుండి తీసుకు వచ్చిన వర్మ తన కాన్సెప్ట్ లతో ఎంతో మంది దర్శకులుగా పరిచయం అయ్యేందుకు హెల్ప్ చేయడం జరిగింది. కొన్ని సార్లు తన శిష్యుల నుండి నిర్మొహమాటంగా స్క్రిప్ట్ ను తీసుకుని సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది. తాజాగా తన శిష్యుడు తెరకెక్కించిన సినిమాను వర్మ కాపీ కొట్టినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వర్మ శిష్యుడు అజయ్ భూపతి తాజాగా ‘ఆర్ ఎక్స్100’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రం విభిన్నమైన ప్రేమ కథతో పాటు – రొమాంటిక్ సీన్స్ ఎక్కువ మొతాదుతో తెరకెక్కడం జరిగింది. దాంతో ఆ చిత్రానికి యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. తాజాగా వర్మ నిర్మించిన ‘భైరవగీత’ అదే కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

రొమాంటిక్ సీన్స్ తో పాటు ముద్దు సీన్స్ హద్దు లేకుండా ‘భైరవగీత’ చిత్రంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య చిన్న చిత్రాలు నిలదొక్కుకోవాలంటే – ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి అంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్ ఉండాలి. అందుకే ఈ చిత్రంలో వర్మ లెక్కకు మించి ముద్దు సీన్స్ ఉండేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు – కన్నడంలో ద్వి భాష చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ను రేపు విడుదల చేయబోతున్నారు. పోస్టర్ లోనే ముద్దుతో ముంచెత్తిన వర్మ ట్రైలర్ లో మరింత మసాలా దట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. శిష్యుడు కాన్సెప్ట్ ను కాపీ కొట్టిన వర్మకు సక్సెస్ దక్కేనా చూడాలి.