వాయిదా వెనక టాప్ సీక్రెట్స్!

0

ఇప్పటికే రెండుసార్లు డేట్ మారింది. రిలీజ్ తేదీని పదే పదే వాయిదా వేస్తూ వాయిదాల ఫర్వానికి తెరతీశారు. ఇలా వాయిదా వేస్తూ కూడా తెలివిగా ప్రచారం చేసేస్తున్నారు. మొత్తానికి యాక్షన్ ఫ్యాక్షన్ `భైరవగీత` ఉచితంగా బోలెడంత ప్రచారం కొట్టేసింది. ఏ ప్రచారాన్ని ఎలా హోరెత్తిస్తే ఉచితంగా పబ్లిసిటీ కొట్టేయొచ్చో తెలిసిన రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ఛీప్ పబ్లిసిటీకి తెర తీయడమే ఈ వాయిదాల వెనక ఉన్న అసలు సీక్రెట్ అన్న మాటా వినిపిస్తోంది.

వాస్తవానికి 2.ఓ తో పోటీపడుతూ అంటూ ప్రగల్భాలు పలికిన ఆర్జీవీ అనూహ్యంగా `భైరవగీత`ను వారం పాటు వాయిదా వేశాం అంటూ ట్విస్టిచ్చారు. అదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నది మీడియాకు తెలిసినా మంచితనంతోనో – తెలిసీ తెలియని తెలివితక్కువతనంతోనో ఉచిత పబ్లిసిటీ చేసేసింది. 2.ఓ కి పాజిటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత ఆర్జీవీ ఆలోచన మార్చుకుని వాయిదా వేశారన్నది ఇంకో వృధా ప్రయాస పబ్లిసిటీకి మీడియా స్వయంకృతమే కారణం.

ఇక ఆర్జీవీ తీసిన సినిమాకు సెన్సార్ పరంగానూ చిక్కులున్నాయా? ఈ చిత్రంలో న్యూడ్ సీన్లు పెచ్చుమీరాయా? బూతు డైలాగులున్నాయనా? సెన్సార్ వాళ్లు ఏమైనా తిట్టారా? మరీ రా కంటెంట్ వల్ల సెన్సార్ గడపపై ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఆర్జీవీపై నెగెటివ్ ప్రచారం ఇబ్బంది పెట్టిందా? ఇలా ఇన్ని కోణాల్లో పరిశీలిస్తే అవన్నీ నిజాలేనని తేలింది. రక్తపాతం.. రాళ్లు నెత్తిన పెట్టి బాదేయడం.. ఇవన్నీ రియల్ గా చూపించే ప్రయత్నం మరోసారి జరిగింది. అందుకే వర్మకు లైన్ క్లియర్ కాలేదట. వివాదాల వర్మ సమర్పణలో ఆయన శిష్యుడు సిద్ధార్థ తెరకెక్కించిన `భైరవగీత`లో సీమ మనోభావాల్ని దెబ్బ తీసే అంశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయలసీమ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ- ఇర్ర మోర్ వేడెక్కించే సీన్లలో జీవించారట. ఆ ఇద్దరి మధ్యా న్యూడిటీ తప్పనిసరిగా చర్చకొస్తుందన్న మాటా వినిపిస్తోంది. రకరకాల కారణాలతో నవంబర్ 30న రిలీజ్ కావాల్సినది కాస్తా డిసెంబర్ 7కు వాయిదా వేశారు. అయినా అప్పటికీ పనవ్వడం లేదట. మళ్లీ డిసెంబర్ 14కు వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే కన్నడ వెర్షన్ మాత్రం డిసెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారట. అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ – భాస్కర్ రాశి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి వాయిదాల ఫర్వంతోనూ ఉచిత ప్రచారం కొట్టేయడమెలానో వర్మను చూసి ఇతరులు నేర్చుకోవాలేమో!!
Please Read Disclaimer