మెగా ఫ్యామిలీపై మరో కామెంట్ చేసిన వర్మ

0

వర్మ ఈమధ్య అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీని కలవడం జరిగిందట. ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ “రీసెంట్ గా అల్లు బాబీని కలిశాను. అసలు అయన ఎందుకు సిల్వర్ స్క్రీన్ పై లేడని షాక్ అయ్యాను. ఫ్రాంక్ గా చెప్పుకుంటే మొత్తం మెగా స్టైలిష్ పవర్ ఫ్యామిలీలో ఉండే ఇతర మగాళ్ళ కంటే పెద్ద మగాడిలా ఉన్నాడు.. ఎందుకు??” అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కు చాలామంది ఇంట్రెస్టింగ్ రిప్లైస్ ఇచ్చారు.

ఒక నెటిజనుడు “ఇప్పుడే ఆర్జీవీ గురించి అలోచించాను. అసలు అయన ఎందుకు సిల్వర్ స్క్రీన్ పై లేడని షాక్ అయ్యాను. ఫ్రాంక్ గా చెప్పుకుంటే ఆర్జీవీ తెరకెక్కించిన తెలుగు.. హిందీ సినిమాల్లో ఉండే విలన్స్ కంటే పెద్ద విలన్ ఆర్జీవి అనిపించాడు… ఎందుకు??” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే వర్మను తిట్టిపోశారు. ఒక నెటిజనుడు “అర్థరాత్రి 2.30 కు ట్వీట్ పెట్టావంటే నాలుగు పెగ్గులు వేసుకొని ఉంటావు. నువ్వు నిద్రపోవు జనాలను నిద్రపోనివ్వవు” అంటూ చిరాకు పడ్డాడు.
Please Read Disclaimer