బాహుబలి2 ని డైనోసర్‌ తో పోల్చిన వర్మ

0RGV-and-Baahubali2‘బాహుబలి 2’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వెరైటీ కామెంట్స్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘బాహుబలి’ని డైనోసర్‌తో పోల్చిన వర్మ.. ఇతర సినిమాలను కుక్కలు, పులులతో పోల్చాడు.

అలాగే ఇతర దర్శకులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్‌ అభిమానుల మొహాల్లో వెలుగును చూస్తున్న ఇతర హీరోల ఫ్యాన్స్‌ అసూయపడుతున్నారంటూ తనలోని అక్కసును వెళ్లగక్కుతూ ట్వీట్‌ చేశాడు.

అనంతరం ‘ఏనుగులాంటి సినిమా వస్తుందంటే కుక్కల్లాంటి సినిమా రూపకర్తలు మొరుగుతారు. అయితే డైనోసర్‌ వస్తే ఈ కుక్కలు, పిల్లులు, సింహాలు కూడా దాక్కుంటాయి. నాకు ఇప్పుడే తెలిసింది.. ‘బాహుబలి-2’ ఘర్జనలను వినలేక తెలుగు, హిందీ, తమిళ దర్శకులందరూ తమ తమ చెవుల్లో దూదులను పెట్టుకున్నార’ని అంటూ వరుస ట్వీట్లు చేశాడు.