ఆ అమ్మాయితో డిస్ట్రబ్ అయ్యా: వర్మ

0ఒక్క హిట్టు కోసం చకోర పక్షిలా తిరుగుతున్న రాంగోపాల్ వర్మ.. తొలిసారి ఓ నిర్మాతతో కలిసి డిఫెరెంట్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘భైరవగీత’. తెలుగు – కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమా సూపర్ అంటూ సోషల్ మీడియాలో వర్మ తెగ ప్రచారం చేస్తున్నాడు. హీరోయిన్ గురించి ఆకాశానికెత్తేస్తున్నాడు. ఇరా నటన చూసి డిస్ట్రబ్ అయ్యానని.. బోల్డ్ గా ఆమె నటించిన తీరు అద్భుతమని వర్మ తెగ సంతోషపడిపోతున్నాడు.

భైరవ గీత చిత్రం కోసం ఆడిషన్స్ నిర్వహించగా… ఇరా అనే అమ్మాయి తన ప్రతిభతో రాంగోపాల్ వర్మను విపరీతంగా ఆకట్టుకుందట. దీంతో ఆమెకు వెండితెర అవకాశాన్ని వర్మ ఇచ్చాడు. ‘భైరవగీత’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. హీరోగా ధనుంజయ నటిస్తున్నాడు.

రాంగోపాల్ వర్మ – మరో నిర్మాతతో కలిసి తీస్తున్న ఈ మూవీ ద్వారా సిద్ధార్థ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. భూస్వాములకు – పేదవర్గాలకు జరిగే పోరాటంలో ఓ వ్యక్తి ఎలా ఎదుర్కొని ముందుకెళ్లాడన్నదే అసలు కథ.. వర్మ మార్క్ హింసాత్మకం – గ్రామీణ నేపథ్యం ఎలాగూ ఉంటుందని సమాచారం. ఓ అందమైన లవ్ స్టోరీని ఇందులో ఇమడ్చారట.. సినిమా బాగా వస్తుండడంతో వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ సినిమాకు హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.