రామ్ గోపాల్ వర్మ ఇరగదీసాడు

0ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను కొత్తగా తీసిన పోర్న్ సినిమాను ఎంతలా ప్రమోట్ చేసుకోవాలో అంతలా ప్రమోట్ చేసుకుంటున్నాడు. సినిమాను డబ్బులు కోసం తీయలేదు అని చెబుతూ.. సినిమాను కాసింత కూడా ఖర్చుపెట్టకుండా చక్కగా మార్కెటింగ్ చేస్తున్నాడు. అదిగో ముఖ్యంగా టివి ఛానెల్స్ లైవ్ డిబేట్స్ చూస్తుంటే మాత్రం మతిపోతోంది. ఈ సందర్భంగా వర్మ కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేస్తున్నాడు.

అదేదో కార్యక్రమంలో భాగంగా.. వర్మ చాలామందిని కొట్టేస్తున్నట్లు ఒక వీడియో తీశారు. స్వతాహాగా మనోడు కరాటే ఫైటర్ కాబట్టి.. బాక్సింగ్ కిక్కులను ఇమిటేట్ చేయటంలో తన టాలెంట్ చూపించేశాడంతే. తన కొడుతుంటే అక్కడున్నోళ్లందరూ పడిపోతున్నట్లు ఒక సినిమా హీరో స్థాయిలో తన టాలెంట్ చూపించేశాడు మన డైరక్టర్. నిజానికి తనను విమర్శిస్తున్న ఆ సదరు క్రిటిక్స్ ను ఇలాగే కొట్టేస్తానని కూడా అంటున్నాడు వర్మ. బాగానే ఉంది సార్.. మీ ఫ్రస్ట్రేషన్ మీరు ఆ విధంగా చూపించేశారు.. మరి మీ సినిమాలను ట్వీట్లను పోర్న్ డాక్యుమెంటరీలను చూపించినప్పుడు జనాలకు కూడా అదే రేంజు ఫ్రస్టేషన్ ఉంటుంది కదా సార్? మర్చిపోయారే.

ఇకపోతే ప్రస్తుతం మియా మాల్కోవా తో తీసిన పోర్న్ డాక్యుమెంటరీ గురించి ప్రచారం చేస్తున్న వర్మ.. త్వరలోనే ముంబాయ్ లో నాగార్జునతో చేసే సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ ను మొదలెడుతున్నాడట. ఈ సినిమా షూటింగ్ నిజానికి నాగ్ హలో సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉండటంతో వాయిదా పడిందట. ఆ తరువాత హలో ఎఫెక్ట్ నుండి నాగ్ కోల్కొని ఇప్పటికీ షూటింగ్ కు వస్తానని చెప్పినట్లు టాక్.