ప్రేమికుల రోజు వర్మ కుట్రలు

0

సినిమాలు ఎలా ఉంటాయన్న సంగతి పక్కన పెడితే పబ్లిసిటీ చేసుకోవడంలో తనకెవరూ సాటి రారని వర్మ మరోసారి రుజువు చేస్తున్నాడు. వివాదాస్పద అంశాలతో రూపొందుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇంతకు ముందు మహానాయకుడు డేట్ అనౌన్స్ చేసిన 20 నిమిషాల లోపు తన ట్రైలర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చేసాడు. ప్రేమికుల రోజునే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నాడో వేరే చెప్పాలా.

ఎన్టీఆర్ కోరి వరించి లక్ష్మి పార్వతిని చేసుకుంది ప్రేమ వివాహమే. అందుకే సింబాలిక్ గా వర్మ ఆ డేట్ ని టార్గెట్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. దీని మీద మాత్రం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి నెలకొంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ప్రాథమిక అంచనాకు రావడానికి ట్రైలర్ సహాయపడుతుంది కాబట్టి వ్యూస్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చాలదు అన్నట్టు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వర్మ ఇది కుటుంబ కుట్రల చిత్రం అని క్యాప్షన్ పెట్టి మరింత నిప్పును రాజేస్తున్నాడు.

ఆ మధ్య చంద్రబాబుని ఉద్దేశపూర్వకంగా వర్మ చెడుగా చూపిస్తున్నాడని టిడిపి వర్గాలు పోలీస్ కేసులు దాకా వెళ్తే వర్మ వాటిని లైట్ తీసుకుని రివర్స్ లో గట్టి కౌంటర్లు ఇచ్చాడు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలైతే వేడి ఇంకా రాజుకోవడం ఖాయం. ఎన్టీఆర్ మహనాయకుడు రిలీజ్ డేట్ గురించి ఇంకా క్లారిటీ లేదు. అదే సమయంలో వర్మ దూకుడు పెంచేసాడు. ఒకవేళ లక్ష్మిస్ ఎన్టీఆర్ ముందు రిలీజైపోయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా మారుతుంది. అయితే అంత గుడ్డి నమ్మకం పెట్టుకోలేం కానీ అభిమానులకైతే అంచనాలు ఉన్నాయి. ఏదైతేనేం వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లవర్స్ డే రోజు ఎలాంటి సంచలనం రేపబోతోందో చూడాలి.
Please Read Disclaimer