చిరుకి సీన్ వివరిస్తున్న వర్మ

0RGV-with-Chiranjeeviరాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడనే విషయం చెప్పడం మాత్రం చాలా కష్టమైన విషయం. చాలాసార్లు మెగా హీరోలంటే అస్సలు పడని వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. సరిగ్గా మెగా సినిమాల రిలీజ్ సమయంలోనే విపరీతమైన యాక్టివ్ అయిపోయి.. ఓవర్ హైప్ చేసేసి.. అది నెగిటివ్ రియాక్షన్ ఇచ్చేవరకూ హంగామా చేస్తాడు. సినిమా తేడా వస్తే ఇంకా రెచ్చిపోతాడు.

ఇదంతా మెగా హీరోలంటే తనకున్న విపరీతమైన అభిమానంతోనే అని చెప్పడం వర్మకే చెల్లుతుంది. అయితే.. ఈ మధ్య జరుగుతున్న హంగామాకు భిన్నంగా ఇప్పుడు రియాక్డ్ అయ్యాడు రాంగోపాల్ వర్మ. మెగాస్టార్ చిరంజీవి- వర్మ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి.. ‘నాకు అత్యంత మధురమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటి’ అంటూ ట్వీట్ చేశాడు. చిరు-వర్మ ఇద్దరూ కలిసి అప్పట్లో ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఊర్మిళ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాత. కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత.. హఠాత్తుగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది.

ముందుగా సంజయ్ దత్ కు ఇచ్చిన కమిట్మెంట్ కోసం.. ఆ సినిమా తీసొస్తానని వర్మ చెప్పినట్లు చిరు రీసెంట్ గా బయటపెట్టారు. అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి సీన్ వివరిస్తున్న దర్శకుడగా వర్మ కూర్చున్న పిక్ నిజంగానే బాగుంది. ఈ సీన్ మళ్లీ వచ్చే కనిపించే ఛాన్స్ దాదాపు లేనట్లే కదా.. అందుకే తియ్యటి జ్ఞాపకం అనుంటాడు వర్మ.