వర్మతో బాలయ్య చిత్రం.. నిజం కాదట

0


Balakrishna-Offer-to-RGVనిన్న వినిపించిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే.. రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా.. ”ఎన్టీఆర్” బయోపిక్ సినిమా పట్టాలెక్కుతోందని. ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు పూర్తవ్వలేదు అని అనేక వార్తలు వినిపిస్తున్న వేళ.. అసలు ఈ కాంబో కొత్తగా తెరమీదకు రావడంతో అందరూ షాకైపోయారు అంతే. భల్లాలదేవుని దెబ్బకి ఊపరాడని మాహిష్మతి సామ్రాజ్యం టైపులో తయారైంది సినిమా లవర్స్ పరిస్థితి.

అయితే అసలు ఈ రూమర్లలో ఎటువంటి నిజం లేదని అంటున్నారు సన్నిహితులు. బాలయ్య నిజంగానే ఎన్టీఆర్ బయోపిక్ గురించి సీరియస్ గానే ఆలోచిస్తున్నారు కాని.. అసలు స్ర్కిప్ట్ అనేదే ఇంకా ఒక కొలిక్కి రాలేదట. రాజకీయంగా సినిమాలపరంగా ఎన్టీఆర్ జీవితంలో కొన్ని కాంట్రోవర్శీలు కూడా ఉన్నాయి. వాటిని ఏమాత్రం టచ్ చేయకుండా.. సభ్య సమాజానికి ఇబ్బందులు కలగకుండా.. సినిమాను నీట్ గా తీయాలనేది బాలయ్య కోరిక. పైగా రాఘవేంద్రరావు వంటి సీనియర్ దర్శకులు అయితే సినిమాకు న్యాయం చేస్తారని ఆయన ఫీలింగ్. అంతేకాని రామ్ గోపాల్ వర్మ అసలు బాలయ్య మైండ్లోనే లేరట.

ఇకపోతే గతంలో ‘రైతు’ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ద్వారా మన బాలయ్య బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను కలసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వర్మతో మాంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడంతో.. మనోడు నిజంగానే వర్మ డైరక్షన్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్ చేస్తున్నాడేమో అని కంగారేసింది జనాలకు. అయితే అందులో నిజంలేదని తెలియగానే.. మహాష్మతి ఊపిరి పీల్చుకో అన్నా చందాన వారికి కాస్త రిలీఫ్ ఇచ్చినట్లయ్యింది.