రాజమౌళి చేసినట్లు నేను చేయలేను

0RGV-Praises-Rajamouliడైరెక్టర్ రాము గోపాల్ వర్మ ఏమన్నా ఏం చేసినా అది వింతగానే అనిపిస్తుంది. దేన్నీ ఒక పట్టాన నమ్మడు ఒప్పుకోడు. గత వైభవం దండిగా ఉన్న రాము ఇప్పుడు సినిమాలలో పస లేకుండా తీసి అందరిచే విమర్శలపాలు అవుతున్నాడు. అతని విమర్శ ఒక చర్చకు మూలకారణం. కొన్ని కొత్త న్యూస్ లుకు ప్రధాన కారణం. అతనికి ఫలానా అని ఏమి ఉండదు ఎవరిపై ఏమి అనిపిస్తే అప్పటికి ఎలా అనిపిస్తే అలా అది అనేస్తాడు. ఈ మధ్య కాలంలో రాములో మార్పు వచ్చినట్లు ఉంది. తెలుగు సినిమా సత్తాను బాలీవుడ్లో ప్రచారం చేస్తున్నాడు.

ఎప్పుడు ఎవరని పొగడని రాము నోట బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గురించి హీరో ప్రభాస్ గురించి చాలానే వచ్చేస్తోంది. “బాహుబలి లాంటి సినిమాలు బాలీవుడ్ లో నిర్మించలేకపోవడానికి కారణం రాజమౌళి లాంటి ఊహ లేకపోవడం. నిజ జీవితానికి అందని ఊహా ప్రపంచం నిర్మించే సత్తా లేకపోవటం. అలా ఊహించిన దాన్ని అందరికి నచ్చేలాగా ప్రతివాడు నమ్మేలాగా తీయగలగటం. రాజమౌళి కి ఉన్నంత దృఢవిశ్వాసం బాలీవుడ్ లో స్టార్ హీరోలుకు డైరెక్టర్లుకు లేదు. నాకు అయితే అది ఈ జన్మకు రాదు. అన్నేళ్ళు అంత నమ్మకంగా పని చేయడం నా వల్ల కాదు. ఇక బాలీవుడ్ వాళ్ళు ఇటువంటి కథను ముందు అసలు నమ్మరు. ఇది ఇంత బిజినెస్ చేస్తుంది అనే ఊహ కూడా వాళ్ళకు రాదు” అంటూ ఒక బాలీవుడ్ కాంక్లేవ్ లో మనోడు తేల్చిపారేశాడు.

ఇంకా హీరో ప్రభాస్ గురించి కూడా గొప్పగానే చెప్పుకు వచ్చాడు. “బాహుబలి 1 మరియు 2 సినిమాలు కోసం మూడు నాలుగు ఏళ్ళు ఒక హీరో వదులుకోవడం ఆ కథను నమ్మి ఇంతలా కష్టపడటం సాధారణ విషయం కాదు. యాక్షన్ డ్రామాను ఇన్నేళ్ళు విరామం లేకుండా చేయడం నాకు తెలిసి ప్రభాస్ కాకుండా ఇంకా ఎవరు చేయలేరు” అని చెప్పాడు. సంకోచం లేకుండా ఒక కథపై ఇంతాలా నమ్మకం పెట్టి రాజమౌళి ఊహకు అందరి సంకల్పము జతచేసి నిర్మించారు కాబట్టే ఇంతటి విజయం దక్కింది అని వివరణ ఇస్తూ.. నేనైతే రాజమౌళి తీసినదాంటిలో ఒక్క శాతం కూడా తీయాయలేను అని ఒక నిర్దారణకు వచ్చాడు రాము. పోన్లేండి.. ఎక్కడి ‘షోలో’ టైపులో ఇప్పుడు బాహుబలి రిటర్న్స్ వంటి సినిమా అటెంప్ట్ చేస్తాడేమోనని భయం వేసింది.