నాకు కులపిచ్చి అంటున్న ఆర్జీవీ

0

రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉంటాడో అక్కడ సందడి.. హంగామా ఉండడం కామనే. చప్పగా ఉండే కార్యక్రమానికి కూడా మసాలా కలిపి స్పైసీగా తయారు చేయడంలో ఆయన దిట్ట. తాజాగా అయన ‘భైరవగీత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనదైన.. తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్లో పంచ్ లు వేసి ఈవెంట్ ను కలర్ ఫుల్ గా మార్చాడు.

ఈ ఈవెంట్ కోసం యాంకర్ అవతారమెత్తిన రామ్ గోపాల్ వర్మ ‘భైరవగీత’ సినిమా పాటలను ఒక్కొక్కటిగా అతిథుల చేత ఆవిష్కరింపజేశారు. ఒక పాటను రిలీజ్ చేసేందుకు దర్శకుడు సుధీర్ వర్మను ఆహ్వానిస్తూ “నాకు కుల పిచ్చి.. అందుకే సుధీర్ వర్మను పిలుస్తున్నాను” అని అన్నాడు. ఈ పంచ్ తో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మరో పాటను విడుదల చేసేందుకు దర్శకుడు అజయ్ భూపతి ని పిలుస్తూ “అజయ్ ఆరెక్స్ 100 కాదు ఆర్డీఎక్స్ 100” అని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. RX 100 రిలీజ్ కాకమునుపే సినిమా హిట్ అవుతుందని తనకు చెప్పాడన్నాడు. అప్పుడు తన మనసులో “ఒకవేళ సినిమా హిట్ అయితే కాన్ఫిడెన్స్.. హిట్ కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది” అని అనుకున్నాడట.

మరో పాటను ఆవిష్కరించేందుకు ప్రొడ్యూసర్ రామసత్యనారాయణను పిలిచాడు. అయన మాట్లాడుతూ వర్మ తనకు దేవుడి లాంటివాడని వర్మ దర్శకత్వంలో మరో సినిమా ను నిర్మించే అవకాశం తనకు మరోసారి ఇవ్వాలని కోరాడు. ఇక ‘భైరవగీత’ తప్పకుండా విజయం సాధిస్తుందని రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అన్నాడు.. వెంటంటే వర్మ అందుకొని “నీ కాళ్ళ మీద పడి పోతాను” అన్నాడు. ఏదేమైనా వర్మ తనలోని యాంకర్ ను బయటకు తీసి అందరిని ఫుల్ గా నవ్వించాడు.
Please Read Disclaimer