వర్మ వివాదం..సంజూ బయోపిక్ మళ్లీ తీస్తా..

0సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన మూవీ ‘సంజు’. ఈ మూవీ గురించి తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంజు సినిమా తనని తీవ్రంగా నిరాశపరించిందన్నారు. ఇది పూర్తి అవాస్తవాలతో తీసిన చిత్రమన్నారు. సంజు బయోపిక్ ని తాను మళ్లీ తెరకెక్కిస్తానని ప్రకటించారు. వర్మ ప్రకటనతో బాలీవుడ్ లో దుమారం రేపింది. సంజు చిత్రంలో సంజయ్ దత్ ను మంచోడిగా చూపించారని వర్మ ఆరోపించారు. వాస్తవాలతో మళ్లీ తెరకెక్కిస్తానని ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో కథనాలు వచ్చాయి.

వర్మ మాట్లాడుతూ.. ‘డ్రగ్స్ కేసు – ముంబై పేలుళ్లు ఇలా అనేక వివాదాలు సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్నాయి. ముంబై పేలుళ్ల ఘటన సంజయ్ దత్ జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ ఘటనని సంజు చిత్రంలో సరైన విధంగా చూపించలేదని వర్మ అన్నారు. వర్మ కేవలం 1993 ముంబై పేలుళ్లు – సంజయ్ దత్ నుంచి ఏకే 47 స్వాధీనం అంశాలపైనే చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ చూపినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.

కాగా రాంగోపాల్ వర్మ ఇప్పటికే సంజయ్ దత్ జీవితంలోని వివాదాలపై పరిశోధన మొదలుపెట్టినట్టు తెలిసింది. సంజయ్ దత్ సన్నిహితులని అప్పటి పోలీసులను వివరాలు అడిగి సేకరిస్తున్నట్టు సమాచారం. వర్మ దర్శకత్వంలో సంజయ్ దత్ సినిమాలోని మరో కోణం ఎలా ఉండబోతుందో చూడాలి.