దావూద్ పై వర్మ వెబ్ సిరీస్

0ముంబై సహా ఇండియాని గజగజ ఒణికించిన కిరాతకుడు ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్. వ్యవస్థలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని తపించే దుష్ట డాన్గా అతడి గురించి అందరికీ తెలుసు.
పోలీసులకు చిక్కకుండా ఇండియా వదిలి దుబాయ్ – పాకిస్తాన్ లో నివాసం ఉంటూ ముప్పుతిప్పలు పెడుతున్న అతగాడు ఇప్పటికీ ఇండియాలో తన ఆపరేషన్స్ సాగిస్తున్నాడన్న సమాచారం ఉంది. దావూద్ ని పట్టిస్తే బహుమానం ఘనంగానే ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అన్ని గుండెలు ఎవరికీ లేకపోవడంతో దావూద్ కి ఎదురే లేకుండా పోయింది. మాయలమారి పాకిస్తాన్ దావూద్ ని పెంచి పోషిస్తోందన్న సంగతి విధితమే.

అదంతా అటుంచితే ఇప్పుడు దావూద్పై ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించేందుకు వివాదాల వర్మ రెడీ అవుతుండడం వేడి పెంచుతోంది. 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ మళ్లీ తెరపై చూపిస్తానని వర్మ డైరెక్టుగానే ప్రకటించాడు. బాబ్రీ మసీదు అల్లర్లు – సినీతారలు – బాలీవుడ్ మేకర్స్ తో దావూద్ సత్సంబంధాలు వగైరా వగైరా యథాతథంగా చూపిస్తానని వేడి పెంచాడు. 20ఏళ్లుగా ముంబై మాఫియాతో తనకు ఉన్న సత్సంబంధాల ద్వారా సేకరించిన సమాచారాన్ని యథాతథంగా తెరకెక్కిస్తానని అన్నాడు. మొత్తం 5 సీజన్లలో 10 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఉంటుందని తెలిపాడు.