ఆ గుంపులో రాకుమారి ఎవరు?

0కొన్ని విజయాలు..కొన్ని పరాజయాలు.. మరికొన్ని అనుభవాలు.. ఇదీ హీరో రామ్ కెరీర్ జర్నీ. ఈ పయనం ఇలానే సాగనీ అన్నట్టుగా అతడి వాలకం ఉంది. ఈ ప్రయాణంలోనే అతడికి త్రినాథరావు నక్కిన తగిలాడు. వీళ్లతో దిల్ రాజు జాయినయ్యారు. వయసుకు వచ్చాం – నేనులోకల్ – సినిమా చూపిస్త మావ లాంటి ఫార్ములాటిక్ సినిమాలతో విజయాలు అందుకున్న రామ్కి ఓ బంపర్ హిట్ ఇస్తానన్న కసితోనూ పని చేస్తున్నాడు త్రినాథరావు నక్కిన. ఆ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ లాంటి అందాల నాయికను రామ్ సరసన నాయికగా ఎంపిక చేసుకుని తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. `హలో గురు ప్రేమకోసమే` అన్న టైటిల్ తోనే త్రినాథరావు మరోసారి టైటిల్ పరంగా కుర్రకారు గుండెల్ని టచ్ చేశాడు.

ప్రేయసి కోసం ఓ కాలేజీ చుట్టూ తిరిగే కుర్రాడిగా రామ్ ని చూపిస్తున్నాడు. మరి… ఆయన ప్రేమ ఫలించడానికి ఈ ప్రదక్షణలు – వెయిటింగ్ లు ఫలిస్తాయా లేదా? అన్నది తెరపై చూడమంటున్నారు.ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఇంజనీరింగ్ విద్యార్థినిగా నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో కీలకమైన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాత్రివేళల సీన్స్ ఉన్నాయిట. ఇక రామ్ – అనుపమ జంట ఇందులో బావ – మరదళ్లేనని తెలుస్తోంది. హీరోకి మామయ్య పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. టాకీ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మొత్తం ఓ గ్రూప్ ఫోటో దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ గుంపులో అనుపమ రాకుమారిలా కనిపిస్తుంటే ఆ పక్కనే రామ్ రాకుమారుడిలా కనిపిస్తున్నాడు. హలోగురు ప్రేమకోసమే ఈ ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.

కాలేజ్ ప్రేమకథల్ని ఎన్నిసార్లు తీసిన ఆదరించడం మన తెలుగు ఆడియెన్ గొప్పతనం కాబట్టి రామ్-అనుపమల లవ్ స్టోరిని అంగీకరిస్తారేమో చూడాలి. ఇకపోతే `తేజ్.. ఐ లవ్ యు` రూపంలో అనుపమకు చేదు అనుభవం మిగిలింది కాబట్టి ఈసారి హిట్టు కొట్టాల్సిందే. రామ్కి గతానుభవాల దృష్ట్యా ఈ సినిమా కెరీర్ కి ఎంతో ఇంపార్టెంట్. దర్శకనిర్మాతలదీ సేమ్ సీన్. ఓ హిట్టిస్తారేమో చూడాలి గురూ!