ఛాక్లేట్ బాయ్ కండలు పెంచేశాడే

0ఛాక్లేట్ బాయ్ అని ప్రేమగా ఎవరి పిలుచుకుంటారో అందరికి గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్ లో తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న రామ్ కు ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. ఇక ఈ లవర్ బాయ్ ని ఎనర్జిటిక్ హీరో అని కూడా సినీ ప్రముఖులు బిరుదులు ఇచ్చారు. రామ్ వచ్చిన కొత్తలో ఎంత సుకుమారంగా ఉన్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మనోడు కండలు పెంచేసి హార్డ్ గా కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా సోషల్ మీడియాలో రామ్ పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న ఈ హీరోకు ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగేలా ఉంది. బరువైన డంబుల్స్ పట్టుకొనిక్ జిమ్ లో అంతగా కష్టపడుతున్నాడు ఏంటి అబ్బా అని అనుకుంటున్నారా..? అదేనండి ఫిట్ నెస్ చాలనేజ్ తో ప్రస్తుతం సినీ లోకం ఉహిపోతోంది కదా!. అందులో భాగంగానే ఈ యువ హీరో కళ్యాణ్ రామ్ కు విసిరిన ఛాలెంజ్ కు రిప్లై ఇచ్చాడు.

ముందుగా థ్యాంక్స్ చెప్పి.. రెండు డంబుల్స్ తో తన ఎనర్జీని చూపించాడు. ఇక నేను కూడా ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను నామినేట్ చేస్తున్నట్టు రామ్ పేర్కొన్నాడు. మీ ఫిట్ నెస్ ఛాలెంజ్ చూపించండి అంటూ అభిమానులను రామ్ కోరాడు. ప్రస్తుతం రామ్ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.