లేడీస్ హాస్టల్లోకి డేరా బాబా సొరంగ మార్గం… సంచుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు

0Ram-Rahim-to-DGP-Prisonడేరా బాబా అకృత్యాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. డేరా బాబా ఆశ్రమం లోపలి నుంచి ఓ సొరంగ మార్గం వెళ్లింది. అది పేరు మోసిన లేడీస్ హాస్టల్లోకి వెళ్లడం చూస్తే ఎన్ని దారుణాలు జరిగి వుంటాయో ఇట్టే అర్థమవుతుంది. ఈ సొరంగ మార్గం పయనించే ముందు ఓ పెద్ద గది వుంది. అందులో పెద్దపెద్ద సంచుల్లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు కనిపించాయి.

డేరా బాబా ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించేందుకు 41 కంపెనీల ఆర్మీ జవాన్లు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక ప్రత్యేక పోలీస్ టీం, బాంబ్ స్క్వాడ్ పాల్గొన్నాయి. డేరా బాబా ఆశ్రమంలో పెద్దఎత్తున రద్దయిన నోట్లు కనిపించాయి. ఇంకా భారీగా పేలుడు పదార్థాలు సైతం లభించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ గుట్టగుట్టలుగా అస్థిపంజరాలు కూడా లభ్యమయ్యాయి.

డేరా బాబా లైంగిక వాంఛను తీర్చేందుకు అంగీకరించని అమ్మాయిలను హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు డేరా బాబా ఆశ్రమంలో 7 ఎకరాల తోట ఒకటి ఉంది. అందులోనే ఈ అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మరిన్ని తవ్వకాలు చేస్తే ఇంకెన్ని లభిస్తాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డేరా ఆశ్రమంలో విస్తృత తనిఖీల నేప‌థ్యంలో అక్క‌డ మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను సెప్టెంబర్‌ 10 వరకు నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు డేరా బాబా పెంపుడు కూతురుగా చెప్పబడుతున్న హనీ తప్పించుకుని నేపాల్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.