తారక్-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ రంభ?

0ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ పై ప్రస్తుతం అంచనాలు పెరిగే విధంగా సరికొత్త కథనాలు వస్తున్నాయి. అవి ఎంత వరకు నిజమో తెలియదు కాని చిత్ర యూనిట్ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. దీంతో రూమర్స్ కాస్త నిజమయ్యేలా ఉన్నాయని టాక్ గట్టిగా వస్తోంది. కాస్త ఫ్యాక్షన్ డ్రామాను జోడించి తారక్ ని సరికొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. మాటల మాంత్రికుడు సరికొత్త డైలాగులు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయట.

ఇక లేటెస్ట్ అప్డేట్ సంగతి ఏంటంటే.. సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు 1990లలో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన రంభ. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తన కథలో ఒక స్పెషల్ రోల్ కోసం చాలా మంది సీనియర్ నటీమణులను అనుకున్నప్పటికి ఫైనల్ గా రంభని ఫైనల్ చేశాడని సమాచారం.

చివరగా రంభ తారక్ తో యమదొంగ సినిమాలో ఒక ఒక పాటలో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇక పదేళ్ల తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నారు. మరి ఆ పాత్ర ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఆ విషయాన్ని తెలుపలేదు. కానీ మరికొన్ని రోజుల్లో సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నట్లు సమాచారం.