కుటుంబాన్ని క‌లుపుతున్న చ‌ర‌ణ్‌

0ram-charan-1విడిపోయిన కుటుంబాన్ని క‌లిపే బాధ్య‌త చ‌ర‌ణ్ తీసుకొన్నాడు. ఫ్యామిలీ అంత‌టినీ ఒక్క‌తాటిపై తీసుకొచ్చాడు..! ఈ స్టేట్‌మెంట్ విన‌గానే చ‌ర‌ణ్‌.. డాడీనీ బాబాయ్‌ని క‌లిపేశాడా? అనుకోవ‌ద్దు. ఇది ఓ సినిమా స్టోరీ. రియ‌ల్ లైఫ్‌లో కాదు లెండి. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా లైన్ ఇది. కుటుంబ బంధాల నేప‌థ్యంగా సాగే క‌థ ఇది. ఉమ్మ‌డి కుటుంబంలో మ‌న‌స్స‌ర్థ‌లు ఉండ‌కూడ‌ద‌నే సందేశం ఇస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ విదేశాల్లో చ‌దువుకొని ఇండియాకి వ‌చ్చే కుర్రాడిగా క‌నిపిస్తారు. ఇక్క‌డికొచ్చాక ఇంట్లో స‌మ‌స్య‌ల్ని ఎలా చ‌క్క‌దిద్దాడో తెర‌పై చూడాల్సిందే. ఈ చిత్రం కోసం టైటిళ్ల వేట సాగుతోంది. గోవిందుడు అంద‌రివాడేలే అనే టైటిల్ అనుకొన్నా.. ఇప్పుడు దాన్ని ప‌క్క‌న పెట్టి కొత్త టైటిల్ వెదుకుతున్నారు.