రామ్ చరణ్ ‘తుఫాన్’ సెప్టెంబర్ 6న రిలీజ్!

0

toofan-release-dateమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ముంబై పోలీస్ పవరేంటో ఇందులో చరణ్ చూపించనున్నాడు.

రామ్ చరణ్ నటిస్తున్న ‘తుఫాన్’ (హిందీలో జంజీర్) చిత్రం విడుదలలో ఏ మార్పూ లేదనీ, ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 6న ఇది విడుదలవుతుందనీ నిర్మాత చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఓపత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ముంబై నగరాన్ని గడగడలాడించిన ఆయిల్ మాఫియా ఆగడాలను అరికట్టే పొలీసధికారి పాత్రలో చరణ్ అత్యద్భుతంగా నటించాడని నిర్మాతలు తెలిపారు. ‘మగధీర’ తర్వాత ఈ సినిమాలో చరణ్, శ్రీహరి మధ్య వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని అన్నారు. హిందీ, తెలుగు వెర్షన్లు రెండూ సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతాయని పేర్కొన్నారు.

రామ్ చరణ్ ‘తుఫాన్’ సెప్టెంబర్ 6న రిలీజ్!, Ramcharan Toofan Release Date, Ramcharan Toofan Releasing on 6th September, Toofan Release Date,Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home