ఆ ఇద్దరూ వరుణ్ తేజ్ సినిమాలో స్పెషల్!

0మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సంకల్ప్ రెడ్డి ‘అంతరిక్షం’ తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో ‘F2’ అనే మల్టిస్టారర్ కూడా చేస్తున్నాడు. ఇవి కాకుండా సాగర్ చంద్ర డైరెక్షన్లో ఒక లవ్- యాక్షన్ ఎంటర్టెయినర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

దర్శకుడు సాగర్ చంద్ర  ‘అయ్యారే’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. తన మూడవ చిత్రాన్నివరుణ్ తేజ్ తో చేస్తున్నాడు.  14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ప్రస్తుతం జోరుగా సాగుతోందట.  క్యాస్టింగ్ టెక్నిషియన్స్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారట.   కీలక పాత్రల కోసం ఇద్దరు టాప్ ఆర్టిస్టులను తీసుకుంటున్నారట. వారిలో ఒకరు రమ్య కృష్ణ కాగా మరొకరు బొమన్ ఇరానీ.  ‘బాహుబలి’ తర్వాత రమ్య కృష్ణ మంచి ఫామ్ లోకి వచ్చింది.  ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. చైతు తాజా చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’ లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే కదా.   సో.. రమ్య కు ఈ సినిమాలో కూడా ఓ పవర్ఫుల్ రోల్ ఇచ్చి ఉంటారు.

మరోవైపు బాలీవుడ్ లో భారీగా ఫీజు తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ బొమన్ ఇరాని తెలుగులో కూడా నటించాడు. బొమన్ తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను కట్టి పడేస్తాడు.  మరి ఇలాంటి ఆర్టిస్టులు ఇద్దరూ సినిమాలో ఉంటే ఇక మెగాహీరో వాళ్లను డామినేట్ చేసేందుకు కాస్త కష్టపడాల్సిందే.   ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుపెడతారట.   మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో మరో షెడ్యూల్ యూరోప్ లో ను ప్లాన్ చేశారట.