అత్తకి బై చెప్పిన మారుతి

0మారుతి అత్తాఅల్లుళ్ల కథతో సినిమా తీస్తున్నాడు. అదే `శైలజారెడ్డి అల్లుడు`. నాగచైతన్య అల్లుడు కాగా… రమ్యకృష్ణ అత్తగా నటిస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. అత్తమ్మ ఇగో నేపథ్యంలో ఈ చిత్రం సాగబోతోందని సమాచారం. మారుతి స్టైల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. ఒకొక్కరు తమ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకొని వెళ్లిపోతున్నారు. మొట్ట మొదట సెట్ నుంచి అత్తమ్మని పంపించేశాడు మారుతి. రమ్యకృష్ణ నేపథ్యంలో సాగే సన్నివేశాలు బుధవారంతో పూర్తి కావడంతో ఆమె నిన్ననే సెట్ కి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది.

అయితే స్వతహాగా మారుతికి రమ్యకృష్ణ అంటే ఎంతో అభిమానం. ఆమెతో పనిచేయడం ఓ మరపురాని అనుభూతి అంటున్నాడాయన. అందుకే రమ్యకృష్ణకి తనదైన శైలిలో బై చెప్పాడు మారుతి. తన యూనిట్ లోని కెమెరా డిపార్ట్మెంట్ ని బ్లాక్ డ్రెస్ కోడ్ లోనూ – డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ని వైట్ డ్రెస్ కోడ్ లోనూ పిలిపించి రమ్యకృష్ణకి బై చెప్పించాడు. ఆమెతో కలిసి ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు మారుతి. నాగచైతన్య ఒకపక్క సవ్యసాచి సినిమా చేస్తున్నప్పటికీ… శైలజారెడ్డి కోసం నాన్ స్టాప్ గా కాల్షీట్లు కేటాయించడంతో సినిమా శరవేగంగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సమాచారం.