మహేష్ కోసం శివగామి ఎంట్రీ?

0

ఇంకా మహర్షి విడుదల కానేలేదు అప్పుడే మహేష్ 26కి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ఇప్పటికే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా హీరోయిన్ గా రిటైర్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారని విజయశాంతిని అనిల్ రావిపూడి ఒప్పించాడన్న టాక్ ఇప్పటికే బలంగా గుప్పుమంటోంది. ఖరారు అయ్యిందని షూటింగ్ రోజున ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఆల్రెడీ జగపతిబాబు లాక్ అయిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ఏంటంటే ఇందులో శివగామి రమ్యకృష్ణ ఎంట్రీ కూడా ఉంటుందట. తనకు మాత్రమే సెట్ అయ్యే ఓ పవర్ ఫుల్ పాత్ర అనిల్ స్క్రిప్ట్ లో ఉందని ఈ వారం పది రోజుల్లో విన్పించి ఆవిడ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటాడని వినికిడి

చూస్తుంటే మహేష్ 26లో ముప్పై ఏళ్ళ క్రితం తెరను ఏలిన స్టార్లు ఇందులో క్యూ కట్టేలా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జగపతిబాబుకి విజయశాంతితో ఆశయం రమ్యకృష్ణతో ఆయనకిద్దరు లాంటి సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడీ ముగ్గురు కలిసి మహేష్ కోసం టై అప్ అవుతున్నారు అంటే విశేషమేగా.

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోయే ఈ మూవీని ఆరు నెలల లోపే పూర్తి చేసే టార్గెట్ తో యూనిట్ బరిలో దిగనుంది. మహర్షి ఫలితం ఓ కొలిక్కి వచ్చాక దీన్ని లాంఛనంగా సెట్స్ పైకి తీసుకువెళ్తారు. ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి
Please Read Disclaimer