మారుతికి శైలజత్త కాంప్లిమెంట్

0మూడు దశాబ్ధాలుగా సీనియర్ నటి రమ్యకృష్ణ టాలీవుడ్ లో నటిస్తూనే ఉన్నారు. గ్లామరస్ కథానాయికగానే కాదు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఎందరో అగ్ర దర్శకులతో – యువదర్శకులతో కలిసి పని చేశారు. కానీ అందరిలోనూ మారుతి దాసరి జెట్ స్పీడ్ అని కాంప్టిమెంట్ ఇచ్చారు ఈ సీనియర్ నటి. అతడికి మంచి భవిష్యత్ ఉందని పొగిడేశారు.

శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ సందర్భంగా బర్త్ డే చిట్ చాట్ లో మాట్లాడిన రమ్యకృష్ణ పైవిధంగా స్పందించారు. నా కెరీర్ లో ఇంత వేగంగా సినిమా తీసిన వేరొక దర్శకుడు లేడు! అని కితాబివ్వడం ఆసక్తి రేకెత్తించింది. డైరక్టర్ మారుతి గారు వర్కింగ్ స్టైల్ ఎలా వుంది.. సీనియర్ గా ఎమైనా టీజ్ చేశారా..? అన్న ప్రశ్నకు రమ్యకృష్ణ తన అభిప్రాయం తెలిపారు. “టీజ్ చేయటమా అంత టైమే ఇవ్వరు ఈ డైరక్టర్.. బాబోయ్ స్పీడ్ గా వర్క్ చేస్తారు. మిషన్ లా … జస్ట్ రెడి అయ్యి కూర్చుందామనుకునే సరికి రెడీ రెడీ అని కాల్ చేస్తారు. ఓక రోజు వర్షం పడుతుంది కదా వదిలేస్తాడేమో అనుకున్నా.. ఆ గ్యాప్ లో కూడా షూట్ చేసేసారు.. వెరి గుడ్ ఫ్యూచర్ వుంది. వెరి గుడ్ ప్లానింగ్.. నా కెరీర్ లో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ చేసి ఇంత ఫాస్ట్ గా ఇచ్చిన చిత్రం శైలజారెడ్డి మాత్రమే..“ అని చెప్పారు రమ్యకృష్ణ.

అంత పెద్ద నటితో ఈ పొగడ్త దక్కించుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. ఆన్ లొకేషన్ తాను చూసినదే చెప్పానని రమ్యకృష్ణ తెలిపారు. క్షణం తీరిక లేకుండా పని చేసే దర్శకుడు మారుతి. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దర్శకుడు అని కితాబిచ్చారు. ఈ స్ఫూర్తితో మారుతి మరింత వేగంగా సినిమాలు తీయాలని కోరుకుందాం. ఇప్పటికిప్పుడు మారుతి లైనప్ దర్శకుడిగా – నిర్మాతగా చాలా పెద్దగానే ఉందన్నది సన్నిహితుల మాట.