డ్రగ్స్ కేసుపై స్పందించిన రానా

0Rana-Daggubatiప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు అందటంతో ఈ విషయం మరింత సీరియస్ గా మారింది. అయితే ఈ విషయంలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని తప్పించేందుకే ఎలాంటి అండ లేనివారిని ఫోకస్ చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ రంగాన్ని శాసించే కొత్త మంది వారసులు కూడా ఇందులో భాగమన్నా టాక్ వినిపిస్తుంది.

అయితే ఇదే విషయం పై జాతీయ మీడియాతో స్పంధించిన రానా, తనకు అలాంటి అలవాట్లు లేవని క్లారిటీ ఇచ్చాడు. ‘రోజుకు 20 కిలో మీటర్లు జాగింగ్ చేస్తూ ఫిట్ గా ఉండేందుకు కష్టపడుతున్నా.. డైట్, ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఒక వేళ డ్రగ్స్ వాడితే ఇవన్ని సాధ్యమేనా.. మీరే చెప్పండ’న్నాడు. ఇప్పటికే రానా తండ్రి సురేష్ కూడా డ్రగ్స్ కేసు వివరణ ఇచ్చారు.