‘హిరణ్యకసిప’ వరల్డ్ టార్గెట్!?

0

టాలీవుడ్ సీనియర్ దర్శకులు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ `హిరణ్యకసిప` ఉందా లేదా? ఈ సినిమాని ప్రకటించి ఇప్పటికే చాలా కాలమైంది. కానీ ఇంతవరకూ దీనికి సంబంధించిన పని నడుస్తోందా.. లేదా.. అన్నదానికి ఎలాంటి స్పష్టతను గుణశేఖర్ ఇవ్వలేదు. రానా ప్రధాన పాత్రలో హిరణ్యకసిప లాంటి భారీ ప్రాజెక్టును తెరకెక్కించే ఆలోచన ఉందని – అందుకోసం ప్రీప్రొడక్షన్ సాగుతోందని మాత్రం ఇదివరకూ వార్తలొచ్చాయి. అసలింతకీ ఈ ప్రాజెక్టు ఉందా .. లేదా?

ఇదే ప్రశ్న నేడు `అదుగో` ప్రమోషన్ వేడుకలో పాత్రికేయులు సంధిస్తే నిర్మాత డి.సురేష్ బాబు షాకిచ్చే సంగతులే చెప్పారు. `హిరణ్యకసిప` కోసం ఎక్కువ మంది పని చేస్తున్నారు. ఓవైపు గుణశేఖర్ ఆఫీస్ లో వర్క్ జరగుతోంది. ఇక్కడ(రామానాయుడులో) అక్కడా అన్నిచోట్లా పని సాగుతోంది. లండన్ ఆఫీస్ లోనూ దీనికి సంబంధించిన పని చేస్తున్నారు. ఈ సినిమాని ఇండియా లెవల్లో – వరల్డ్ సినిమా స్టాండార్డ్స్ తో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసే ఆలోచన ఉంది. దీనికి రానానే నిర్మాత.. నటుడు.. ప్రొడక్షన్ వర్క్ అంతా తానే. వీఎఫ్ ఎక్స్ బేస్డ్ సినిమాలంటే రానాకు చాలా ఇష్టం. కామిక్స్ ని అమితంగా ఇష్టపడతాడు. `అమర్ చిత్ర కథ` పుస్తకాలకు అభిమాని. అందుకే సాంకేతికంగా బెస్ట్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.. అని తెలిపారు.

వాస్తవానికి భారతదేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేసేంత పెద్ద కాన్వాసుతో ఈ చిత్రాన్ని తీయాలన్న ఆలోచన ఉంది.. అందుకు తగ్గట్టే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ నే కేటాయించనున్నారట. భారీ వీఎఫ్ ఎక్స్ తో ముడిపడి ఉంది కాబట్టి సమయం అంతే ఎక్కువ తీసుకుంటుందని అర్థమవుతోంది. ఇది కేవలం తెలుగు భాష వరకే కాదు – ఇతర మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని తీసే సినిమా. అందుకే పెద్ద కాన్వాసు పై తీస్తున్నారని భావించవచ్చు. ఇదివరకూ ఫిలింఛాంబర్ లో `హిరణ్యకసిప` టైటిల్ ని రానా – గుణశేఖర్ బృందం రిజిష్టర్ చేయించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer