రానా నక్సలైట్ టీం ఇదే జులైలో వార్ కు రెడీ

0

యంగ్ హీరో రానా తన తదుపరి చిత్రంకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా ఒక చిత్రం చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. సురేష్ బాబు మరియు సుధాకర్ చెరుకూరిలు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రానా 1990 కి చెందిన నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు జరిగిన నక్సలైట్ ఉద్యమంకు సంబంధించిన నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఒక యువకుడు నక్సలైట్ గా మారిన క్రమంను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

రానాకు జోడీగా ఈ చిత్రంలో సాయి పల్లవి నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. రానా బాహుబలితో ఇండియా వ్యాప్తంగా స్టార్ డంను దక్కించుకున్న కారణంగా ఈ చిత్రంను తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో టబు మరియు ప్రియమణిలు కనిపించబోతున్నారు. టబు ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతుండగా ప్రియమణి ఫోక్ సింగర్ గా కనిపించనున్నారట. భారీ తారాగణంతో రూపొందబోతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కు అన్ని సిద్దం అయ్యాయి. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను జులై నెలలో రెగ్యులర్ షూట్ కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer