రానా చేతిలో ప్రధాన మంత్రి కేసు

0Rana-Daggubati--CBI-officerతెలుగు సినిమా యోధుడు రానా దగ్గుబాటి ఇప్పుడు మరో విభిన్న పాత్ర చేయడానికి సిద్దపడ్డాడు. బాహుబలి లో ప్రతినాయకుడుగా చేసి అందరినీ మెప్పించిన రానా వెంటేనే ఘాజి లో నేవీ అధికారిగా మారి తన ఎంచుకున్న దారి ఏంటో అందరికీ చెప్పాడు. ప్రాజెక్టు మంచిదైతే అందులో చిన్న రోలైన చేయడానికి సిద్దపడతానని చెప్పకనే చెబుతున్నాడు.

కన్నడ డైరెక్టర్ ఏఎంఆర్ రమేశ్ దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య పై ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా రానాని ఏనుకొన్నారు. ఇందులో రానా సిబిఐ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ్ హిందీ కన్నడ లో విడుదల చెయ్యడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ హత్య ఇన్వెస్టిగేషన్లో కీలక పాత్ర పోషించిన అధికారి కార్తికేయన్ పై ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. రానా ఇప్పుడు నేషనల్ హీరో అయ్యాడు తమిళ్ లో కూడా రానా సుపరిచతమే హిందీ లో బాహుబలి కి ముందే హీరోగా చేశాడు. ఇప్పుడు బాహుబలి సినిమాతో దేశం మొత్తం మంచి పేరు సంపాదించాడు. పైగా అతని బాడీ ఫిట్నెస్ గురించి చెప్పే పనిలేదు. దేశంలో ఏ యుద్ధ కథ చిత్రాలు తీద్దాం అనుకున్న అందరికీ గుర్తుకు వచ్చేది రానా పేరే. అందుకే ఈ ప్రాజెక్టు కూడా వచ్చేసుంటుందిలే.

ఇకపోతే సినిమాకు సంభందించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలిసి ఉంది. ఈ సినిమాలో మరో హిందీ నటుడు సర్కార్ ఫేమ్ రవి కాలే నటిస్తున్నారు. అయితే ఆల్రెడీ ”మద్రాస్ కేఫ్” అంటూ జాన్ అబ్రహాం రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో పేర్లు చెప్పకుండా ఒక సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకూ ఈ సినిమాకూ మరి డిఫరెన్స్ ఏముంటుందో చూడాలి.