మరో భారీ మల్టీస్టారర్ లో రానా

0

బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న టాలీవుడ్ నటుడు రానా. ఇప్పటికే పలు హిందీ సినిమాల్లో నటించిన రానాకు ‘బాహుబలి’ సినిమాతో అక్కడ ఇంకాస్త ఇమేజ్ పెరిగింది. బాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాల సందడి కొనసాగుతున్న ఈ సమయంలో రానాకు ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంలో ఛాన్స్ దక్కింది. అభిషేక్ దానియా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మించబోతున్న ‘భుజ్’ అనే చిత్రంలో రానాకు ఛాన్స్ దక్కింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సంజయ్ దత్ సోనాక్షి సిన్హా పరిణితి చోప్రా ఇంకా పలువురు స్టార్స్ కనిపించబోతున్నారు.

రియల్ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ కసరత్తు జరుగుతుంది. బాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం వర్క్ చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్ లో రానాకు ఛాన్స్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ నుండే కాకుండా సౌత్ నుండి ఇలాంటి క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్న ఏకైక హీరోగా రానా నిలిచి పోవడం ఖాయం. ఒక వైపు వరుసగా తెలుగు సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ కు కూడా వెళ్లడం రానాకే చెల్లింది. భుజ్ చిత్రంలో రానా పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందని ఈ చిత్రం తర్వాత రానా బాలీవుడ్ కు మరింత దగ్గర అవ్వడం ఖాయం అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer