అది నా ఆరోగ్యం…మీది కాదు:రానా

0టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి కొంతకాంలగా సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా రకరకాల పుకార్లు షికార్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. రానా కంటి సమస్యతో బాధపడుతున్నాడని….కిడ్నీ సంబంధిత వ్యాధికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడుని పుకార్లు వచ్చాయి. అంతేకాదు అమెరికా లేదా సింగపూర్ లో రానా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోబోతున్నాడని – రానా తల్లి లక్ష్మి కిడ్నీ దానం చేయబోతోందని దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితుడు ఒకరు చెప్పినట్లు ఓ ప్రముఖ ఇంగ్లిషు దినపత్రిక కథనం వెలువరించింది. అయితే అటువంటిది ఏమీ లేదని రానా త్వరలోనే షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడని మరొక సన్నిహితుడు చెప్పినట్లు ప్రచురించింది. దీంతో రానా ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పుకార్లపై రానా స్వయంగా స్పందించాడు. తాను బాగానే ఉన్నానని ఇటువంటి పుకార్లను పుట్టించవద్దని ట్వీట్ చేశాడు.

తనపై వచ్చిన పుకార్లను రానా ఖండించాడు. వాటిన నమ్మవద్దని ట్వీట్ చేశాడు.‘నా ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వింటున్నాను. నేను బాగానే ఉన్నాను… కేవలం బీపీకి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నా. త్వరలోనే ఆ సమస్య పరిష్కారమవుతుంది. మీరు చూపించిన ప్రేమమాభిమానాలకు కృతజ్ఞతలు. కానీ నా ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు చేయకండి. పుకార్లు సృష్టించకండి. ఇది నా ఆరోగ్యం…. మీది కాదు.’అని రానా ట్వీట్ చేశాడు. అంతేకాకుండా సోమవారం నుంచి రానా…..ఎన్టీఆర్ బయోపిక్ షూట్ తో పాటు నెం.1 యారీ షో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని దగ్గుబాటు కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పారు. ఇపుడు రానా ఇచ్చిన క్లారిటీతోనైనా ఆ పుకార్లకు తెరపడుతుందో లేదో వేచి చూడలి.