‘వర్మ’ గా నటించబోతున్న రానా

0rana-as-varmaరానా ఏంటి వర్మగా అలరించడమేంటి అనుకుంటున్నారా? వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ కాదు.. మహారాజ తిరునాళ్ మార్తాండవర్మ. కేరళ ట్రావెన్‌కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ జీవితాధారంగా ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమాలో మార్తాండవర్మగా రానా నటించనున్నారు. ఈ విషయాన్ని రానా సోషల్ మీడియాలో వెల్లడించారు. “అనిళం తిరునాళ్ మార్తాండ వర్మ- ది కింగ్ ఆఫ్ ట్రావెన్‌కోర్ మూవీతో రాబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను కె.మధు డైరెక్ట్ చేస్తున్నారు. రాబిన్ తిరుమల కథ అందించారు.” అని రానా ట్వీట్ చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రానా.. నెక్ట్స్ ‘1945’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.