రానా-త్రిష ముద్దు ఫోటో లీక్

0Rana-Kissing-Trisha-pic-Leaked-By-Suchitraచాలాకాలం క్రితం.. అసలు తమిళ సుందరి త్రిషకు వరుణ్ మనియన్ తో ఎంగేజ్మెంట్ అవ్వక ముందు.. హీరో రానా దగ్గుబాటితో ఓ ఘాడమైన ప్రేమ యవ్వారం ఉందనేది టాక్. ఎన్నిసార్లు వీరు ఈ విషయాన్ని కాదని తోసిపుచ్చినా కూడా.. వీరు గోవాలో కెమెరా కంట చిక్కడం.. అలాగే కె.రాఘవేంద్రరావు కొడుకు పెళ్ళిలో కలసి ఒక జంటలా అందరికీ నమస్కారం చెప్పడంతో.. మ్యాటర్ అందరికీ అర్ధమైంది.

కాని ఏమైందో ఏంటో తెలియదు.. ఇట్టే బ్రేకప్.. కట్ చేస్తే వరుణ్ మనియన్ తో ఎంగేజ్మెంట్.. అక్కడ కూడా బ్రేకప్ చేసుకుంది త్రిష. దానికంటే మునుపు రానా-త్రిషలు ఇద్దరూ ట్విట్టర్లో అన్ ఫాలో చేసుకోవడం.. ఇన్ డైరక్ట్ పంచులు వేసుకోవడం కూడా జరిగిపోయాయ్. అయితే మేమిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ తరువాత కొన్నాళ్ళనుండి మెయిన్టయిన్ చేస్తూ వచ్చారు. అయితే ఈ స్నేహితుడు ఆ స్నేహితురాలి చెంప మీద ఘాడంగా ముద్దిస్తున్న సీన్ ఒకటి ఉంది చూశారు.. ఇప్పుడు సింగర్ సుచిత్ర కార్తిక్ ట్విట్టర్ ఎకౌంట్ నుండి ఆ ఫోటో లీకైంది.

సదరు ఫోటో లీకా లేదా హ్యాకా అనే విషయం తెలియదు కాని.. రానాకు మాత్రం ఇక్కడ షేకవుతోంది. ఇప్పుడు ఈ పిక్చర్ పై అందరికీ ఏమని చెప్తాడు? స్నేహంలో ఇవన్నీ మామూలే అంటాడా? ఏమైనా కూడా సుచిత్ర ఎకౌంట్ ఇప్పుడు రానాను కూడా ఇరికించేసిందిలే.