నారా బాబుగా మారిన రానా

0రానా దగ్గుబాటి ‘ఎన్టీఆర్’ లో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాత్ర కోసం స్లిమ్ అవతారం లోకి మారిన రానా క్లీన్ షేవ్ చేసుకొని – మీసాలు పెంచి బాబును మక్కికి మక్కి దించే ప్రయత్నాలలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. చంద్రబాబు మేనరిజం.. మాట్లాడే తీరు ఇవన్నీ కాపీ కొట్టేందుకు పాత వీడియోలు కూడా చూస్తున్నాడని అన్నారు. మరి అది నిజమే అనిపిస్తోంది.

రీసెంట్ గా షూటింగ్ లొకేషన్ నుండి ఒక పిక్ లీక్ అయింది. చంద్రముఖి సినిమాలో రజినీకాంత్ కిటికీ సందులోలుంచి జ్యోతిక ను చూపిస్తూ “పూర్తిగా చంద్రముఖి మారిన గంగను చూడండి” అంటే వారందరూ ఆ సందులో నుంచి అలా చూసి షాక్ అవుతారు. అలా మీరు కూడా “పూర్తిగా చంద్రబాబుగా మారిన రానాను చూడండి”.. సేమ్ ఫీల్ వస్తుందేమో! రాకపోవచ్చు.. అదేమో దెయ్యం పట్టిన సీన్ కదా. సరే ఇలాంటి పిచ్చి ఉదాహరణలకు అంతూ పంతూ లేదు.

మొత్తానికి రానా మరోసారి ఇంకో పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టే ఉన్నాడు. రీసెంట్ గా రానా నాన్నగారు సురేష్ బాబు మాట్లాడుతూ “పూర్తిగా చంద్రబాబుగా మారిన రానాను” చూసి షాక్ అయ్యాడని చెప్పారు. అది నిజమే అనిపిస్తోంది కదా…?