రానా ను పిలవలేదేందుకు?

0సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సెలబ్రేషన్స్ చేసుకునే ఈ రోజుల్లో హిట్టు టాక్ పక్కా పడింది అంటే ఇంకా ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్ కూడా అదే తరహాలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. మొదటి రోజు మొదటి షోకే ఈ సినిమాపరవాలేదు అనే విధంగా టాక్ తెచ్చుకుంది. తరుణ్ భాస్కర్ సింపుల్ లైన్ లో పరవాలేదు అనిపించే విధంగా మెప్పించాడు.

దీంతో నిర్మాత అందరికి పార్టీ ఇచ్చాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో నిర్మాత సురేష్ బాబు చిత్ర యూనిట్ అందరికి స్పెషల్ గా ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ సెలబ్రేషన్ లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఎవరు కూడా మిస్ అవ్వలేదు. కానీ ఒక్కరిని పిలవకపోవడంతో బాగా ఫీల్ అయ్యారు. అతనే రానా. నన్ను ఎందుకు పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా అడిగేశాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక హోటల్ లో సురేష్ బాబుతో అందరూ ఒక టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్న ఫొటోని రానా జతచేశారు. ఆ విందుకు తనని పిలవలేదంటూ భలే ఆటపట్టించాడు.

ప్రస్తుతం రానా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు సినిమాలు ద్విభాషా చిత్రాలు కాగా ఒకటి తమిళ్ సినిమా మరొకటి మలయాళం సినిమా ఇందులో ఇప్పటికే 1945 అనే సినిమా సగానికి పూర్తయినట్లు తెలుస్తోంది. సత్య శివ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.