పెళ్లి- పిల్లలపై రానా సంచలన వ్యాఖ్య

0

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రభాస్ – రానా. ప్రభాస్ గత కొంత కాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. మిర్చి తరువాత చేసుకుంటానన్నాడు. తర్వాత బాహుబలి పార్ట్ 2 రిలీజ్ తరువాత చేసుకుంటానని.. అటుపై `సాహో` తరువాతేనని మరోసారి చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే టాలీవుడ్ హంక్ రానా సన్నివేశం ఇంతకంటే తీసికట్టుగా ఏం లేదు.

కథానాయికలతో రానా లవ్వాయణంపై కెరీర్ ఆరంభంలోనే కథనాలొచ్చాయి. ఇప్పటికీ పాత ఎఫైర్లపై వరుస కథనాలు వినిపిస్తూనే వున్నాయి. `కాఫీ విత్ కరణ్` షోలోనూ దీనిపై పెద్ద డిబేట్ రన్ అయ్యింది. త్రిషతో డేటింగ్ చేశానని.. చాలా తక్కువ టైమ్ లోనే బ్రేకప్ అయ్యిందని రానా ఆ షోలో సూటిగానే చెప్పేశాడు. ఎఫైర్ తొలి నాళ్లలోనే త్రిషతో ఎఫైర్ ని నిజం చేస్తూ ట్విట్టర్ లో త్రిష- రానా సన్నిహితంగా ఉన్న ఫొటోలు హల్ చల్ చేశాయి.

అయితే తాజాగా పెళ్లి- పిల్లల గురించి రానా చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆదివారం సాయంత్రం నాని నటించిన `జెర్సీ` థాంక్స్ మీట్ (హైదరాబాద్) లో పాల్గొన్న రానా పెళ్లి- పిల్లలు తనకు అస్సలు అర్థం కారని అనడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. “నాకు లైఫ్ లో అర్థం కానివి చాలా వున్నాయి. క్రికెట్ అర్థం కాని ఆట. అలాగే పెళ్లి అర్థం కాదు.. పిల్లలు అర్థం కారు“ అంటూ వ్యాఖ్యానించారు. అయితే అదంతా ఫన్ కోసమే నని అర్థం చేసుకోవాలా? పెళ్లిపై క్లారిటీ మిస్సయ్యాడా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
Please Read Disclaimer