హ్యుమర్ మీద రానా కౌంటర్లు

0

భల్లాలదేవా రానా కు ప్రాంతీయ ఇంగ్లీష్ వెబ్ సైట్ల మీద కోపం వచ్చింది. స్పష్టమైన కారణాలు తన ట్వీట్ లో పెట్టలేదు కాని ఘాటుగా పంచులు మాత్రం వేసాడు. ముందుగా ఆ మెసేజ్ ఏంటో చూద్దాం. ఇవాళ కొన్ని ఇంగ్లీష్ వెబ్ సైట్స్ నా సెన్స్ అఫ్ హ్యుమర్ ని అర్థం చేసుకోలేక కనీసం హాస్యం అనే పదానికి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నాయి. చాలా ఏళ్ళ క్రితం నిలదీయడం కడిగేయడం మానుకున్నాను. మళ్ళి అదే చేయనివ్వకండి. సెలవులను ఎంజాయ్ చేయండి. వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు దీని గురించి మాట్లాడుదాం. ఇదీ రానా పోస్ట్ చేసిన ట్వీట్.

అయితే రానా ఏ సందర్భం గురించి అన్నాడో మాత్రం క్లారిటీ లేదు. బహుశ రానా యాంకరింగ్ చేస్తున్న ఇంటర్వ్యూ షో గురించి సదరు ఇంగ్లీష్ సైట్స్ చేసిన ట్రాలింగ్ గురించి కావొచ్చు. కాకపోతే పెట్టిన ట్వీట్ లో రానా ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా రాయడాన్ని వెంటనే పసిగట్టిన నెటిజెన్లు వెంటనే దాని గురించి అడిగేసారు. అయినా దాన్ని మార్చకుండా వాళ్ళకు అర్థమైతే చాలని స్పెల్లింగ్ తప్పుగా ఉన్న విషయం తనకూ తెలుసనీ కవర్ చేసేసాడు.

మరి రానా ఇచ్చిన కౌంటర్ ఆ కొన్ని ఇంగ్లీష్ సైట్స్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. మొన్నే బర్త్ డే చేసుకున్న రానా ఇంకా ఆ ఆనందం నుంచి బయటికి రాకముందే ఇలా ఫైర్ కావడం అంటే ఏదో విషయంగా బాగా సీరియస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకో మరి. రానా ఇన్నింగ్స్ జనవరిలో ఎన్టీఆర్ సినిమాతో తిరిగి రీ స్టార్ట్ కాబోతున్నాయి
Please Read Disclaimer