రానా, త్రిష సీక్రెట్ మీటింగ్… ఊరంతా చక్కర్లు, హలీమ్‌తో ముచ్చట్లు!

0rana-trisha-affair-newsతమిళ పొన్ను త్రిష గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాల్లో నటించడం లేదు. కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కాని అవకాశం చిక్కినప్పుడల్లా సీక్రెట్‌గా హైదరాబాద్ వచ్చి వెళుతుందట. అంత పెద్ద హీరోయిన్ సీక్రెట్‌గా రావలసిన అనసరం ఏముంది అని అనుకుంటే పొరపాటే. లీడర్ హీరో రైనాతో ఈ అమ్మడు లవ్‌ఎఫైర్ కొనసాగిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని అవన్నీ అబద్ధం అని త్రిష కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

త్రిష తల్లి ఎన్ని సంబంధాలు తెస్తున్నా ఏదోఒక వంక పెట్టి తప్పించుకుంటుందట. అందుకు రానాతో లవ్‌ఎఫైరే కారణమంటున్నాయి సినీవర్గాలు. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఈ మధ్య రానా కోసం త్రిష హైదరాబాద్ కూడా వచ్చిందట. ఇద్దరూ కలిసి ఊరంతా చక్కర్లు కొట్టారట. రంజాన్ సీజన్ కావడంతో హలీమ్ కూడా తిన్నారట.

ఆ సమయంలో కొందరు వీళ్లను చూడటంతో వీళ్ల వ్యవహారం కాస్తా బట్టబయలయ్యింది. నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంటే చేసేసుకోవచ్చుగా. కనీసం ఆ విషయం ఒప్పేసుకోవచ్చుగా. కహానీలు చెప్పడమెందుకు, ఇలా ట్విస్టులు ఇవ్వడమెందుకు అని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.