ఇదేం పర్ఫెక్షనిజం బాబోయ్!!

0సంజయ్ దత్ జీవిత చరిత్ర అంటే.. అదేమీ సింగిల్ యాంగిల్ కాదు. ఒకే లైఫ్ లో ఎన్నో జీవితాలను చూశాడు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. అందుకనే సంజు మూవీకి ఫస్ట్ లుక్ ఇచ్చినపుడే.. రణబీర్ కపూర్ తో రకరకాల లుక్స్ ఇప్పించారు. అన్నిటికంటే ఈ మూవీపై ఆకర్షణ పెరిగిపోవడానికి అతి పెద్ద కారణం.. రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడు కావడమే.

సంజు మూవీలో సన్నివేశాలను పరిశీలించి చూస్తే.. ఈ దర్శకుడి పనితనం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది. సంజయ్ దత్ ను పోలినట్లుగా రణ్ బీర్ కపూర్ ను చూపించడం అంటే.. అది సినిమాకు అవసరం కాబట్టి అంత గొప్ప విషయమేమీ కాదు. కానీ దత్ మూవీస్ లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిలో మున్నాభాయ్ సిరీస్ కూడా ఉంటుంది. దీనికి దర్శకుడు కూడా ఇదే రాజ్ కుమార్ హిరాణీ అని గుర్తుంచుకోవాలి. ట్రైలర్ లో చూపించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సన్నివేశాలను ఓసారి పరికించి చూస్తే.. బ్యాక్ గ్రౌండ్స్ ను కూడా మ్యాచ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కేవలం వెనుక కనిపించే ప్రదేశాలు మాత్రమే కాదు.. ఆయా వ్యక్తులను అచ్చు గుద్దినట్లుగా దింపేశాడు దర్శకుడు. చివరకు ఆయా వ్యక్తులు కూర్చున్న ప్లేస్ మెంట్స్.. వారి డ్రెస్సులు.. మేకప్.. ఇలా మొత్తం అన్నీ కూడా సరిగ్గా అదేలా ఉన్నాయంటే.. డైరెక్టర్ విజన్ కి మైండ్ బ్లాంక్ కావాల్సిందే. పర్ఫెక్టుగా సినిమాలు తీసేవాళ్లు చాలామంది ఉంటారు కానీ.. ఇలా పర్ఫెక్షనిజంను పీక్స్ లో చూపించడం అంటే మాత్రం ఈ దర్శకుడికి మాత్రమే చెల్లింది.