మాజీ ప్రేయసిపై ప్రియుడు ప్రశంసలు జల్లు

0


ranabir-kapoor-and-katrinaరణబీర్ కపూర్ ప్రేమ కథలు గురించి మాట్లాడుకోవడం బాలీవుడ్ కు ఒక మంచి కాలక్షేపం. అతని బ్రేక్ అప్ గురించి కొత్త ప్రేమ కథలు గురించి ఎన్ని సార్లైనా మాటలాడతారు విసుగు చెందకుండా. ఇప్పుడు రణబీర్ కపూర్ కత్రినా కైఫ్ విడిపోయిన తరువాత కలిసి నటించిన సినిమా ‘జగ్గా జాసూస్’ వస్తోంది. నిన్ననే ఒక పాట విడుదల చేశారు చిత్ర బృంధం ఫిల్మ్ డైరెక్టర్ అనురాగ్ బసు హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ కత్రినా కైఫ్ కలిసి. ఈ వేదిక పై రణబీర్ ఒక ఆశక్తికర కామెంట్ చేశాడులే.

“కత్రినా చాలా పెద్ద స్టార్ ఆమె నటించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తన కోసం తానే ఒక సినిమా తీసుకోగలిగే సత్తా ఉంది ఆమెకు ఇప్పుడు. తను ఒక సూపర్ హిట్ ఫిల్మ్ మెషీన్ అని పేర్కొన్నాడు. నేను కానీ సినిమా నిర్మాత అయితే కేవలం ఆమె కోసమే ఒక సినిమా తీస్తాను” అంటూ కామెంట్ చేశాడు రణబీర్. దీనికి పక్కనే ఉన్న కత్రినా నవ్వులు చిందిస్తూ చాలా థాంక్స్ రణబీర్ అని చెప్పి ఊరుకుంది. ఈ జంట ఇంతకు ముందే అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ రాజనీతి అనే రెండు సినిమాలలో కలిసి నటించి మెప్పించారు.

రణబీర్ ఇప్పుడు సంజయ్ దత్త్ బయో పిక్ నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. గత ఏడాది సినిమాలు అన్నీ చాల వరకు నిరాశ పరిచాయి అని చెబుతూ ఈ ఏడాది నాకు గొప్ప డైరెక్టర్లయిన రాజు హీరాణి అనురాగ్ బసు అయాన్ ముఖర్జీ లాంటి వాళ్ళతో పని చేసే అదృష్టం దక్కింది. వాళ్ళు నాపై పెట్టిన నమ్మకానికి వాళ్ళ సినిమా కథకు నేను నా టాలెంట్ తో న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనిచెప్పాడు. రణబీర్ కు ఈ మధ్య కాలంలో ఏయ్బా దిల్ హై ముష్కిల్ తప్పించి బాక్సాఫీస్ హిట్లేమీ లేవు. ఇప్పుడు జగ్గా జస్సూస్ ఏమన్నా తెరిపినిస్తుందేమో చూడాలి.