కాబోయే మరదలికి కానుక?

0బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో రణ్ బీర్ కపూర్ పేరే ముందుంటుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో.. హ్యాండ్సమ్ పర్సన్.. కపూర్ ఫ్యామిలీకి వారసుడు ఇలా చాలా క్వాలిటీలు ఉన్న హీరో కావడంతో రణ్ బీర్ మెచ్చే మగువ గురించి బాలీవుడ్ మీడియా ఎప్పుడూ ఆరా తీస్తూనే ఉంది. ఇంతకుముందు చాలామంది హీరోయిన్లతో కలిపి రణ్ బీర్ పేరు వినిపించింది.

ఎట్టకేలకు రణ్ బీర్ తన మనసులో ఏముందో చెప్పకుండానే చెప్పేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఆలియా భట్ పై తనకున్న ప్రేమను బయటపెట్టాడు. సంజయ్ దత్ బయోపిక్ గా వస్తున్న సంజూ మూవీ ప్రమోషన్స్ లో రణ్ బీర్ ఈ విషయం రివీల్ చేశాడు. ‘‘ఆలియా పని – నటన – జీవితం.. ఇలా ఒకటేంటి ఆమె నుంచి నేను ఇన్ స్పైర్ అయిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆమె పట్ల నా మనసులో ఉన్న భావాన్ని చెప్పాలంటే కొత్త పదం కనిపెట్టాలి’’ అంటూ ఆలియా గురించి తన ఫీలింగ్ చెప్పాడు.

ఆలియా రణ్ బీర్ జీవితం పంచుకోవడం అతడి ఫ్యామిలీ మెంబర్లకు ఇష్టమే. ఇప్పటికే రణ్ బీర్ అక్క రిద్ధిమా కపూర్ సాహ్ని ఆలియాకు ఓ బ్యూటిఫుల్ బ్రాస్ లెట్ గిఫ్ట్ గా పంపింది. ఆ బ్రాస్ లెట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆలియా అది తనకు తెగ నచ్చేసిందంటూ కామెంట్ పెట్టింది. రిద్ధిమా గిఫ్ట్ పంపి కాబోయే మరదలిని ఇంప్రెస్ చేసేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.