రణ్‌బీర్‌తో రొమాన్స్ చేస్తున్న ఆమె ఎవరు?

0ఇటీవల గాసిప్స్‌ విషయంలో కాస్తంత వెనుకబడిన రణ్‌బీర్‌ కపూర్‌ మరోసారి అలాంటి వార్తలతో తళుక్కున మెరిశాడు. మంగళవారం అతడు ఎవరికీ తెలియని ఒక కొత్త అమ్మాయితో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లోకి దూసుకురావడంతో గుసగుసలు గుప్పున అన్నాయి. పైగా కాస్తంత కండలు కూడా పెంచిన రణ్‌బీర్‌తో ఉన్న ఆ అమ్మాయి ఎబరబ్బా అంటూ అంత తెగ ఆలోచిస్తున్నారు. రణ్‌బీర్‌ మరోసారి ప్రేమలో పడ్డాడా? ఆ అమ్మాయి అతడి కొత్త గర్ల్‌ఫ్రెండ్‌? ఒక వేళ అదే నిజమైతే ఇలా అందరికీ తెలిసేలా ఫొటోలకు పోజులిచ్చి వాటిని వేరే వారికి దొరికేలా ఎందుకు చేస్తారని కూడా ప్రశ్నించుకుంటున్నారు.

తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో జగ్గా జాసూస్‌ అనే చిత్రంలో నటిస్తున్న రణ్‌బీర్‌ బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ జీవితకథను అధారంగా చేసుకొని వస్తున్న బయోపిక్‌లో సంజయ్‌గా నటించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దాదాపు 13 కేజీల బరువు కూడా పెరిగిన రణ్‌బీర్‌ మరోసారి హాట్‌గా వార్తల్లో నిలిచాడు. బ్లూషార్ట్‌ షార్ట్స్, వైట్‌ టాప్‌లో ఉన్న ఎవరికీ తెలియని ఓ అమ్మాయితో రణ్‌బీర్‌ రోమాన్స్‌ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. దీంతో అంతా ఆ యువతి రణ్‌బీర్‌ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ అని అనుకుంటున్నారు. అయితే, వాస్తవానికి ఆ ఫొటోలు ఓ కొత్త బ్రాండ్‌కు ప్రకటనలో భాగంగా చేసినవంట. ఈ ఫొటోలో నిజంగానే అతడు సంజయ్‌ పాత్రకోసం కోసం బాడీని పెంచి చాలా ఫిట్‌గా కనిపించాడు.