సీనియర్‌ హీరోపై రణ్‌బీర్‌ తీవ్ర వ్యాఖ్యలు!

0ranbir-kapoorబాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద నటుడు సంజయ్‌దత్‌.. అక్రమ ఆయుధాల కేసులో కొంతకాలం జైలుజీవితం కూడా గడిపిన సంజూ భాయ్‌ జీవిత చరిత్ర ఇప్పుడు సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. యువహీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఈ సినిమాలో మున్నాభాయ్‌ పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్న రణ్‌బీర్‌ తాజాగా ‘డెక్కన్‌ క్రానికల్‌’కు ఇంటర్వూ ఇస్తూ సీనియర్‌ హీరో సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సంజయ్‌ను ఒక ‘ఫ్రాడ్‌’ (వంచకుడు) అని అభివర్ణించాడు.

‘సంజయ్‌ దత్‌ బయోపిక్‌ గురించి చెప్పాలంటే ఆయన తన జీవితం గురించి చాలా నిజాయితీగా వెల్లడించారు. తన తప్పులను ఒప్పుకున్నారు. గాంధీలాంటి వ్యక్తి జీవితాన్ని మేం తెరకెక్కించడం లేదు. మేం ఒక ఫ్రాడ్‌మ్యాన్‌ (వంచకుడి) జీవితాన్నే తెరకెక్కిస్తున్నాం. ఆయన్ను చాలామంది ఇష్టపడతారు.

చాలామంది ద్వేషిస్తారు. ఆయన చాలా వివాదాస్పదుడు. అయినా ఈ సినిమా కోసం తన జీవితం గురించి చాలా నిజాయితీగా చెప్పారు. అది గొప్ప విషయం’ అని రణ్‌బీర్‌ అన్నాడు. ‘నేను ఆయన స్థానంలో ఉంటే ఇంత నిజాయితీగా నేను మంచివాడిని కాదని చెప్పి ఉండేవాణ్ని కాదేమో. ఆయన జీవితం నుంచి ప్రేక్షకులు ఎదైనా గ్రహిస్తే.. అది మంచి విషయమే అవుతుంది’ అని అన్నాడు.

రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో సంజయ్‌ దత్‌ జీవితకథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దివంగత నర్గీస్‌గా మనీషా కోయిరాలా, సునిల్‌ దత్‌గా పరేష్‌ రావల్‌, మన్యతా దత్‌గా దియామీర్జా నటిస్తున్నారు.