విందు భోజనం పెట్టిన రంగమ్మత్త..

0రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ మూవీ లో చ‌ర‌ణ్‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యం గా అనసూయ కు ఈ మూవీ తో మంచి గుర్తింపు వచ్చింది. ఇంతవరకు యూత్ ను మాత్రమే ఆకట్టుకున్న ఈమె , ఈ మూవీ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. ఈ సంతోషాన్ని చిత్ర టీం తో పంచుకుంది.

తాజాగా అన‌సూయ త‌న టీంకి విందు భోజ‌నం ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. రంగస్థలం అసిస్టెంట్ డిజైనర్ గౌరీ నాయుడు ‘రంగమ్మత్త విందు భోజనం’ అంటూ ఓ పిక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘రంగమ్మత్త విందు భోజనం.. మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు’ అంటూ పిక్‌ని పోస్ట్ చేసింది. దీనికి అనసూయ ‘సచ్ లవ్‌లీ టైమ్’ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చింది.