ఆ వీడియోలు చూసే నీకేం తెలుసు : మాధవన్

0

తమిళ స్టార్ నటుడు మాధవన్ సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా మాధవన్ ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో భారీ ఊరేగింపు జరుగుతుంది. వేలాది మంది ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ సమయంలోనే అటు నుండి ఒక ఆంబులెన్స్ వచ్చింది. ఆ జనాల్లోంచి వెళ్లడం తప్ప ఆ ఆంబులెన్స్ కు మరో దారి లేదు. ఆ సమయంలో జనాలు అంతా కూడా ఆంబులెన్స్ కు దారి ఇచ్చేందుకు ఊరేగింపు రధంను వెనక్కు నెట్టడంతో పాటు ఆంబులెన్స్ కు దారి ఇచ్చారు. కొన్ని నిమిషాల్లోనే ఆంబులెన్స్ అక్కడ నుండి వెళ్లి పోయింది.

అంత మంది ఉండగా ఆంబులెన్స్ కు దారి దొరకడం నిజంగా గ్రేట్ అంటూ విడియోపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిశాయి. ఇలాంటి వీడియో షేర్ చేసినందుకు మాధవన్ ను కూడా అభినందించారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా మాధవన్ వీడియోను అభినంధించి ఆ జనాలను ప్రశంసించాడు. భక్తులు మానవీయ కోణంతో ఆలోచించి ఆంబులెన్స్ కు దారి ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని ఒక ఎన్నారై వింతగా తీసుకున్నాడు. మాధవన్ వీడియోకు అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. అంతమంది ఒక ఊరేగింపుగా వెళ్లడం అనాగరిక చర్య దీనిని మీరు సమర్ధిస్తున్నారా అంటూ మాధవన్ తీరుపై అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.

అతడి ట్వీట్ కు మాధవన్ సీరియస్ గా స్పందించాడు. ఈ వీడియోలో చూడాల్సింది ఏంటీ అంటే వేలాది మంది భక్తులు రోడ్డు మీద ఉండి కూడా ఒక ఆంబులెన్స్ వచ్చిందని తెలిసి దానికి దారి ఇచ్చారు. లాస్ ఏంజెల్స్ వంటి ప్రాంతాల్లో ఆంబులెన్స్ కు కనీసం దారి కూడా ఇవ్వరు. అయినా పాజిటివ్ యాటిట్యూడ్ లేని నీ లాంటి వారికి ఈ విషయాలు ఎక్కవు. అసలు నీకు ఇలాంటి విషయాల గురించి ఏం తెలుసు. నీవు ఎంత భావ దారిద్రంతో బాధపడుతున్నావో అర్థం అయ్యింది. అయినా బూతు వీడియలు చూసే నీకు ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయిలే అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు. మాధవన్ ను సమర్ధిస్తూ ఆ ఎన్నారైని తిడుతూ చాలా మంది ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
Please Read Disclaimer